జయరాం హత్యతో నాకు సంబంధం లేదు : నటుడు సూర్య

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 03:57 PM IST
జయరాం హత్యతో నాకు సంబంధం లేదు : నటుడు సూర్య

హైదరాబాద్ : జయరాం హత్యతో తనకు సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య స్పష్టం చేశారు. ఒక సినిమాకు ఆర్థిక సాయం కావాలని రాకేష్ రెడ్డిని కలిశానని తెలిపారు. తన ఫోన్, రాకేష్ రెడ్డి పోన్, ఇతరులతో ఫోన్ నుంచి కానీ జయరాంతో మాట్లాడలేదన్నారు. జయరాంను తాను ఎప్పుడు చూడలేదని.. డైరెక్ట్ గా కలవలేదని.. మాట్లాడ లేదని.. ఫోన్ లో కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనను, తన ఫ్యామిలీని బ్లేమ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సూర్యతో టెన్ టివి ఇంటర్వూ నిర్వహించింది. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం.. 

’కలియుగ అనే సినిమా చేశాను. సినిమా మొత్తం పూర్తైపోయింది. సినిమా బయటికి రావడానికి పోస్టర్స్ కు, పబ్లిసిటీ కోసం నా దగ్గర డబ్బులు లేవు. కొంతమందిని డబ్బులు అడుగుతున్న క్రమంలో ఒక వ్యక్తి రాకేష్ రెడ్డిని నాకు పరిచయం చేశారు. రాకేష్ రెడ్డి రియల్ ఎస్టేట్ అని, పొలిటికల్ పార్టీలో తిరుగుతాడని, సినిమాలకు ఫైనాన్స్ ఇస్తాడని పరియం చేశారు. ఆ విధంగా రాకేష్ రెడ్డిని నేను నాలుగు, ఐదు సార్లు కలిశాను తప్ప ఆయనతో నాకు ఫ్రెడ్ షిప్ లేదు, పరిచయం కూడా లేదు’ అని చెప్పారు.  

’నేను మిమిక్రీ ఆర్టిస్టు కాదు. నా ఫోన్ నుంచి, రాకేష్ రెడ్డి పోన్ నుంచి కానీ జయరాంతో మాట్లాడలేదు. జయరాంను నేను ఎప్పుడు చూడలేదు. డైరెక్ట్ గా కలవలేదు. ఆయనతో మాట్లాడ లేదు. ఫోన్ లో కూడా మాట్లాడలేదు. మీడియా వాళ్లే ఏవేవో కల్పించి రాసి..నన్ను, నా ఫ్యామిలీని బ్లేమ్ చేశారు. నేను కాదని…నాకు తెలిసిన ఫ్రూప్స్ ను డీసీపీ, ఏసీపీకి ప్రజెంట్ చేశాను. వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం పోలీసు డిపార్ట్ మెంట్ పై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. పోలీసులు ఎప్పుడు అడిగినా నేను వెళ్లి కో ఆపరేట్ చేస్తాను. చట్టం, న్యాయానికి కట్టుబడి ఉంటాను’ అని తెలిపారు.  

’నేను రాకేష్ రెడ్డితో ఏం మాట్లాడానో డీసీపీ శ్రీనివాస్ విన్నారు. నాకు.. హత్యకు సంబంధం లేదు. సినిమా తప్ప నాకు వేరే ఏమీ తెలియదు. నేను ఇలాంటి పనులు చేసేవాడినే అయితే.. ఇల్లు అమ్ముకుని కలియుగ సినిమా ఎందుకు తీసేవాడిని. అమ్మనాన్నలను బాగా చూసుకుని, వీలైతే మరో పది మందికి అన్నం పెట్టకల్గేందుకే సినిమా చేశాను తప్ప..ప్రొడ్యూసర్ అయిపోదామని కాదు. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల ఇంకో నాలుగు క్యారెక్టరు వస్తాయని సినిమా చేశాను’ అని పేర్కొన్నారు. 

’జయరామ్ హత్య నాకు తెలియదు. హత్యకు ముందు నేనే రాకేష్ రెడ్డికి కాల్ చేశాను. 25 లక్షలు అప్పు అడిగేందుకు వెళ్లాను. నాకు డబ్బులు ఇవ్వలేదు. రెండు నెలలో రాకేష్ రెడ్డిని మూడు సార్లు కలిశాను. మా నాన్నకు పెరాలసిస్.. అందుకే విషయాన్ని ఆయనకు చెప్పలేదు. రాకేష్ రెడ్డి ఆయన నలుగురు ఫ్రెండ్స్ కలిసి కలియుగ సినిమా చూశారని…సినిమా బాగుందన్నారు’ అని ఇంటర్వ్యూలో సూర్య వివరించారు.