మాట నిలుపుకున్న సీఎం : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 09:24 AM IST
మాట నిలుపుకున్న సీఎం : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో పెట్టారు. ఖమ్మంలో ఇద్దరు కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా నియామకపత్రాలు ఇచ్చారు. సమ్మె కాలంలో పలువురు కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యులను ఆదుకుంటామని, కారుణ్య నియామకాల కింద కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటించిన వారం రోజుల్లోనే నియామకపత్రాలు అందజేశామని మంత్రి చెప్పారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో చనిపోయిన పది మంది కార్మికుల కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున సభ్యులకు ఉద్యోగాలను కల్పించింది. జూనియర్ అసిస్టెంట్‌గా నలుగురికి, కానిస్టేబుళ్లుగా ఐదుగురికి, కండక్టర్‌గా ఒకరికి ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ జోన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె కాలంలో పలువురు కార్మికులు చనిపోయారు. మృతి చెందిన వారి కుటుంబాల విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితులను బట్టి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో తప్పకుండా కొలువు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇప్ుడు మాటను నిలుపుకున్నారు. కేసీఆర్ మాటను నిలబెట్టుకోవడంపై వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించడం ద్వారా కొంత ఊరట లభించినట్ల అయ్యిందన్నారు.