ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్‌ : నిందితులకు కస్టడీ

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 11:22 AM IST
ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్‌ : నిందితులకు కస్టడీ

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్‌లో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. దేవికా రాణితో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 09 నుంచి 10వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. వీరిని ఆ రోజుల్లో సుదీర్ఘంగా విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ జరుగనుందని తెలుస్తోంది. మరోవైపు ఈ స్కామ్‌లో మరొకరు అరెస్టు అయ్యారు.

లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 9కి చేరింది. కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు రాదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 70 డిస్పెన్షనరీలను ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. దేవికారాణి ఇచ్చే స్టేట్ మెంట్‌ను రికార్డు చేయనున్నారు. 

2018 నవంబర్ 3న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. దీన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించే పనిలో ఉండగా… ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిపై అనేక ఆరోపణలు ఉన్నట్టుగా ఈడీకి తెలిసింది. ఈఎస్ఐ – ఐఎమ్ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్‌ఐ డైరెక్టరేట్ ఆఫీస్‌లో పనిచేసే ఫార్మాసిస్ట్‌ రాధికకు.. ఓ డిస్పెన్సరీలోని డాక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణతో మందుల కొనుగోలు బాగోతం బయటపడింది.

ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో ఈఎస్ఐ – ఐఎమ్ఎస్ కేసు అక్రమాలు బయటపడుతున్నాయి. గత నాలుగేళ్లలో రూ.1000 కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించారు. డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవికారాణి 2014 నుంచి 2018 వరకు దాదాపు రూ.1000 కోట్ల వరకు ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు అధారాలు సేకరించారు. 
Read More : ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు