మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్

తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 10:46 AM IST
మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్

తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు మనమే పోటీనని..ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని..16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీని శాసిద్దామని TRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. జాతీయ పార్టీలకు ఓటు వేస్తే..వారికి దండం..దరఖాస్తు పెట్టుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సినవసరం లేదని..ఢిల్లీయే తెలంగాణ భవన్‌కు వస్తుందన్నారు హరీష్. ఏప్రిల్ 01వ తేదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీత లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్..హరీష్ రావు సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ పాల్గొని మాట్లాడారు. 
Read Also : ఆగమాగం కావొద్దు : దేశంలో మార్పు రావాలి – KCR

సునీతా లక్ష్మారెడ్డి TRS పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశం మొత్తంలో తెలంగాణ మోడల్ అని పేరు గడిచిందని..తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకొంటోందన్నారు. 29 మంది ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే పేర్కొందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓట్లు ఏరుకొనే పరిస్థితిలో ఉన్నాయని..డిపాజిట్లు ఎన్ని వస్తాయో లెక్కగట్టుకొనే స్థితికి ఆ పార్టీలు దిగజారాయని విమర్శించారు. మనకు మనమే పోటీనన్నారు హరీష్. జహీరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ..కాళేశ్వరం జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేదని తెలిపారు. 

ఇటీవలే జరిగిన ముందస్తు ఎన్నికల్లో మోడీ, అమిత్ షా, నలుగురు ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తే..103 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో మోడీ, తెలంగాణ రాష్ట్ర నేతలు పర్యటిస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని జాతీయ హోదా, పాలమూరుకు మద్దతిస్తామని మోడీ చెబుతారని అనుకున్నామని.. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. బీజేపీని ప్రజలు పట్టించుకొనే పరిస్థితి లేదని..రాష్ట్రాన్ని చిన్నచూపు చూసింది బీజేపీ పార్టీయేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలవలేదన్నారు. రెండు జాతీయ పార్టీల పరిస్థితి దయనీయంగా ఉందని..16 ఎంపీ సీట్లు సాధిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని హరీష్ రావు చెప్పారు.