Vithika Sheru : 16 ఏళ్ళ వయసులో మా అమ్మ ముందు కమిట్మెంట్ అడిగారు.. నటి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా తన లైఫ్ గురించి, సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో ఎదుర్కున్న ఓ అనుభవం గురించి మాట్లాడింది.

Vithika Sheru : 16 ఏళ్ళ వయసులో మా అమ్మ ముందు కమిట్మెంట్ అడిగారు.. నటి సంచలన వ్యాఖ్యలు..

Vithika Sheru shares her bad experience in movies when she was 16 years old

Vithika Sheru : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలతో మెప్పించింది వితికా షేరు. కెరీర్ లో ఎదుగుతున్నప్పుడే హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. బిగ్ బాస్ లో పాల్గొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు వితికా, వరుణ్. ప్రస్తుతం వితికా సోషల్ మీడియా, యూట్యూబ్, పలు టీవీ షోలతో అలరిస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా తన లైఫ్ గురించి, సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తాను చిన్నప్పటి నుంచి నాన్న లేకుండా పెరిగానని, అమ్మే కష్టపడి పెంచింది అని, 12 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి వచ్చేసానని, చదువు కూడా ఆపేసానని తెలిపింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో ఎదుర్కున్న ఓ అనుభవం గురించి మాట్లాడింది.

Also Read : Vithika Sheru : ఇంకా పిల్లలు ఎందుకు లేరో చెప్పిన వితిక.. ఆ సంఘటనతో..

వితికా షేరు మాట్లాడుతూ.. 12 ఏళ్ళ నుంచి సీరియల్స్, సినిమాలు చేశాను. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కూడా చేశాను. 16 ఏళ్ళ వయసులో నన్ను కమిట్మెంట్ అడిగారు. శ్రీనగర్ కాలనీలో ఓ మూవీ ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్ళాను హీరోయిన్ పాత్రకి. నా యాక్టింగ్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత నన్ను బయటకి పంపి మా అమ్మతో కమిట్మెంట్ అడిగారు, ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్ ఉందని కమిట్మెంట్ లేకపోతే సినిమా ఓకే అవ్వదని చెప్పారు. దానికి మా అమ్మ అది మా కూతురికి చెప్పండి అని నన్ను పిలిచింది. నాకు, మా అమ్మకి మధ్య సీక్రెట్స్ ఏం ఉండవు, అన్ని షేర్ చేసుకుంటాం. మా అమ్మ ముందే నాకు ఆ కమిట్మెంట్ గురించి చెప్పారు. నేను డైరెక్ట్ మొహం మీదే నో చెప్పాను. నాకు ఈ ఛాన్స్ సజెస్ట్ చేసిన వాళ్లకి ఫోన్ చేసి చెప్తే నన్నే తిట్టారు. ఇలాంటివి రెండు, మూడు సార్లు చూసాను. ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే నేను సినిమా చేస్తాను. అందుకే తక్కువ సినిమాలు చేసానేమో అని తెలిపింది.

ఇండస్ట్రీలో ఇప్పటికి ఉందా, వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారా అంటే నాకు తెలీదు. నేను ఫేస్ చేశాను. అలా అని అందరూ అలా ఉండరు. నేను చేసిన సినిమాలన్నిట్లో దర్శకులు, నిర్మాతలు అందరు బాగానే ఉన్నారు. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు అని చెప్పింది. దీంతో వితికా షేరు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.