నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీ

హైదరాబాద్‌ శివారు నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 07:43 AM IST
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీ

హైదరాబాద్‌ శివారు నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తోంది.

హైదరాబాద్‌ శివారు నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తోంది. ఈ మేరకు తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఫస్ట్‌ వార్డు నుంచి తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తనను ఆశీర్వ దించాలని ఆమె కోరారు. తమకు సమాజంలో సరైన గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మున్సిపల్‌ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలి రోజు బుధవారం కేవలం 967 మాత్రమే దాఖలు కాగా, నిన్న ఏకంగా 4వేల 772 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 5వేల 689 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే 143 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేశారు.  

ఇవాళ నామినేషన్ల దాఖలు చివరి రోజుకావడంతో.. భారీ నామినేషన్లు వచ్చే అవకాశముంది. వేలల్లో నామినేషన్లు దాఖలవుతాయని  అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో చాలా వరకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లను వేయనున్నారు.