బస్సులు ఉండవు..క్యాబ్‌లు ఉండవు : మెట్రో దిక్కా ? 

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 03:02 AM IST
బస్సులు ఉండవు..క్యాబ్‌లు ఉండవు : మెట్రో దిక్కా ? 

అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర బంద్. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. వీరి బంద్‌కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు మద్దతు పలికారు. అదే రోజే క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పుండుమీద కారం చల్లినట్లు.. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఉబర్ డ్రైవర్లు 19వ తేదీ శనివారం సమ్మె బాట పట్టబోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్ షెల్టర్లలో రద్దీగా ఉన్నా..బస్సులు లేక ప్రయాణీకులు నరకయాతన పడుతున్నారు.

గమ్యస్థానాలకు వెళ్లే వారు నానా తంటాలు పడుతున్నారు. మెట్రోల్లో అధిక రద్దీ నెలకొనే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణీకుల రద్దీతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రికార్డులు సృష్టిస్తోంది మెట్రో. ఒక్క రోజులోనే లక్షలాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. తాజాగా క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తారని తెలుస్తోంది. దీంతో మెట్రో రైళ్లు మరింత కిటకిటాలాడుతాయని అంచనా వేస్తున్నారు.

మెజార్టీ సిటీ జనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 6 నుంచి రాత్రి 11.30గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్ – మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్ పేట, మియాపూర్ స్టేషన్లలో అధిక రద్దీ ఉంటోంది.

నాగోల్ – హైటెక్ సిటీ రూట్ విపరీతమైన రద్దీగా ఉంటోంది. నాగోల్, ఉప్పల్, తార్నాకా, మెట్టుగూడ, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నట్లు మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. ఆర్టీసీ వారు చేపట్టిన సమ్మెకు అనుగుణంగా మెట్రో అదనపు సర్వీసులను, సమయ వేళలను పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని పలు స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు, అదనపు సిబ్బందిని నియమించింది మెట్రో నిర్వాహకులు. రద్దీ రూట్లలో ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాలకో రైలును నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మె, తెలంగాణ బంద్, క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో మెట్రో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. 
Read More : హైదరాబాద్ రవాణా స్తంభిస్తుందా : క్యాబ్‌ల బంద్ ఎందుకు ?