కరోనా భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనదేనా? 

కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 12:48 PM IST
కరోనా భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనదేనా? 

కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు.

కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు. ఇదే అంశంపై బుధవారం (మార్చి 4, 2020) 10టివి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఐటీ ఉద్యోగులకు ఇళ్లకు పంపించి ఐసోలేషన్ కు ఉన్న అకాశాన్ని కూడా కోల్పోయారని చెప్పారు. రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ కంపెనీల యాజమాన్యాలు కనీస సామాజిక బాధ్యత లేకుండా, బాధ్యతారహిత్యంగా క్యారియర్స్ ను సమాజంలోకి వదిలారని చెప్పారు.

‘‘కరోనా భయాందోళనతో మైండ్ స్పేస్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. 11 వేల ఉద్యోగులను ఖాళీ చేయించారు. దఫా దఫాలుగా అందరినీ ఖాళీ చేయించారు. ఖాళీ చేయించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రత్యక్షంగా తనకు తెలియదు. ఉద్యోగులను ఖాళీ చేసిన తీరుపై అందరూ చాలా అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారు. ఒక ఐటీ సెక్టార్ లో ఇలా జరిగితే, ఐటీ మేనేజ్ మెంట్ ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యను డీల్ చేసే మెకానిజమ్ ఎట్లా వుంటుంది. ఒక కంపెనీలోని ఒక ఫ్లోర్ లో ఒక వ్యక్తికి కరోనా సోకిందంటే 9 రోజులు తర్వాత బయటపడుతుంది. ఈ లోపు క్యారియర్స్ గా ఎంతమంది మారారనేది దానిపై క్లారిటీ లేదు. ఆ ఐదు వందలు, మూడొందల మందిని కర్డూన్ ఆప్ చేసి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఇంతకన్నా మంచి అవకాశం ఇంకెక్కడ దొరికేది కాదన్నారు.

 
బస్సులో ఉన్నటువంటి ఒక ఐటీ సంస్థలాగా ఉండి, ఇన్ఫ్రాస్టక్చర్ వుంటుంది. టాయిలెట్స్ ఉంటాయి. స్లీపింగ్ రూమ్స్ ఉంటాయి. రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ఐసోలేషన్ వార్డు కింద మార్చడానికి ఎలాంటి సమస్య లేదు. కానీ మిస్ హ్యాండిల్ చేసిన తీరు అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ లో ఇలా జరిగింది. 
కరోనా వ్యాధి చైనా నుంచి రాలేదు. గల్ఫ్ నుంచి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు అందరూ యూఏఈ లోగానీ అబుదాబిలో గానీ మస్కట్ లో ఆగి అక్కడి నుంచి ట్రాన్సిట్ లో యూఎస్, యూరప్, లాటిన్ అమెరికాకు వెళ్తూవుంటాం. ఈ ప్రయాణాలు ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు ఎక్స్ పోజర్ కు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇది అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ను దాటి పేదలతోపాటు అందరిలోకి వెళితే కనుక రెస్పాన్స్ సిస్టమ్స్ ఎట్లావుంటాయి. రెస్పాన్స్ సిస్టమ్, రెస్పాన్స్ మెకానిజమ్ పట్ల రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ కంపెనీల యాజమాన్యాలు మినిమమ్ సామాజిక బాధ్యత లేకుండా, బాధ్యతారహిత్యంగా క్యారియర్స్ ను సమాజంలోకి వదిలారు. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. 

వ్యాధిపట్ల ఆందోళన చెందితే నష్టమేమి లేదు. దీన్ని గురించి ఎక్కువ ఆందోళన చెందితే..ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. హైదరాబాద్ సేఫ్ డిస్టినేషన్ కింద ఉండాలంటే దీన్ని వ్యాప్తిని అరికట్టాం…ముందుకెళ్లకుండా ఆపామని చెప్పాలి. కానీ జయేష్ రంజన్ మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడం హర్షించదగ్గ విషయం కాదు. ఇళ్లకు వెళ్లిన 11 వేల మంది ఉద్యోగులకు జయేష్ రంజన్ ను చూసి నవ్వుకుంటారు. ఎవరెవరు వెళ్తున్నారనేది మూడు లక్షల మంది చూశారు. నిజాలను నిజాలుగా చెప్పాలి. ఐసోలేషన్ కు ఉన్న అకాశాన్ని కూడా కోల్పోయారు’’ అని కరణ్ చంద్ర చెప్పారు.