స్టార్టప్ లకు  ప్రోత్సాహం : టీ-వర్క్స్,టాస్క్ లతో ‘మెంటర్’ అగ్రిమెంట్

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 03:55 AM IST
స్టార్టప్ లకు  ప్రోత్సాహం : టీ-వర్క్స్,టాస్క్ లతో ‘మెంటర్’ అగ్రిమెంట్

హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లు, సిస్టమ్స్ రూపకల్పన, తయారీని ప్రోత్సహించేందుకు  ‘మెంటర్-ఏ సిమెన్స్ బిజినెస్’ సంస్థతో టీ-వర్క్స్, టాస్క్ సంస్థలు సోమవారం (ఫిబ్రవరి 25) అగ్రిమెంట్  కుదుర్చుకున్నాయి. మెంటర్ సీఈఓ వాల్డెన్ రైస్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంస్థ దేశీయ డైరెక్టర్ రఘుపనీకర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. 
 

తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ మిషన్స్ తయారీ రంగానికి సంబంధించిన స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్ ఇంక్యుబేటర్ రానున్న జూన్ లో ప్రారంభం కానుంది. ‘వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ’(వీఎల్ ఎస్ ఐ) టెక్నాలజీలో స్థానిక యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి ట్రైనింగ్ అందించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ తో  కలిసి రాష్ట్రంలోని 100మంది ఇంజనీర్లకు ‘పంక్షనల్ వెరిఫికేషన్ యూజింగ్ సిస్టం వెరిలాగ్’ అనే అంశంపై పైలట్ ప్రాజెక్టుగా ట్రైనింగ్ ఇవ్వనుంది.