Hyderabad Metro : మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు పూర్తి ..టికెట్ ధరలు పెంచితే ఊరుకోం : మంత్రి కేటీఆర్
అసెంబ్లీలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ..మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పూర్తిచేస్తాం అని తెలిపారు. హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో, పరిసర ప్రాంతాలలో హైదరాబాదు మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించానికి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోందని సమాధానమిచ్చారు. అలాగే మెట్రో టికెట్ల ధరలు పెంచితే ఊరుకోం అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Hyderabad Metro minister KTR
Hyderabad Metro : అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై ఎమ్మేల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ..మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పూర్తిచేస్తాం అని తెలిపారు. హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో, పరిసర ప్రాంతాలలో హైదరాబాదు మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించానికి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోందని సమాధానమిచ్చారు. అలాగే మెట్రో టికెట్ల ధరలు ఇష్టమొచ్చినట్లుగా పెంచితే ఊరుకోం అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైలు టికెట్ చార్జీలు ఆర్టీసీ చార్జీలతో సమానంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని మెట్రో యాజమాన్యానికి సూచించామని తెలిపారు.
అలా మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకరించటంలేదంటూ ఆరోపించారు. చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్దికి సహకరించే కేంద్రం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటు..శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ కు మాత్రం సహకారం అందించటంలేదని నిధులు విషయంలో తెలంగాణకు మొండిచేయి చూపుతోంది అంటూ ఆరోపించారు. చెన్నై , బెంగుళూరువంటి ఇతర బీజేపీ పాలిత నగరాల్లో మాత్రం మెట్రో రైలు కు కేంద్రం సహకరిస్తుందని కానీ తెలంగాణకు మాత్రం కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందింటంలేదంటూ ధ్వజమెత్తారు.మెట్రో రైలులో ADS ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం అని అది కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కాదు అంటూ స్పష్టంచేసింది కేటీఆర్. మూడు ఏళ్ల లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ను పూర్తి చేస్తాంమని హామీ ఇచ్చిన కేటీఆర్ ఈ ప్రాజెక్టులో ఉద్యోగాలు లోకల్ వారికే ఇస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ పొడిగింపుకు భూసేకరణలో ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు మంత్రి కేటీఆర్.
Hyderabad Metro : పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ చార్జీలు..
మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించానికి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోందని సమాధానమిచ్చారు. అలాగే మెట్రో టికెట్ల ధరలు పెంచితే ఊరుకోం అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా..మెట్రో రైలు చార్జీలు పెంచాలనికోరుతూ హైదాబాద్ మెట్రో యాజమాన్యం కేంద్రాన్ని కోరింది. చార్జీలు పెంచటం కోసం హైదరాబాద్ మెట్రో యాజమాన్యం చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఫేర్ ఫిక్స్‌డ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. ఈక్రమంలో రంగంలోకి దిగిన కమిటీ ప్రస్తుతమున్న మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను నవంబరు 15లోగా తెలపాలని ప్రయాణికులను కోరింది. కానీ చార్జీల ధర పెంచే విషయంలో హైదరాబాద్ వాసులు అంగీరించనట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా మెట్రో రైలు చార్జీలు పెంచే అధికారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ)కు మొదటిసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం మాత్రం కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే ఉంటుంది. దీంతో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కేంద్రాన్ని కోరింది. కాగా..2017 నవంబరు 28వ తేదీ నుంచి మెట్రో రైలులో ప్రస్తుతం కనిష్ఠ చార్జీ రూ. 10 కాగా, గరిష్ఠ చార్జీ 60 రూపాయలుగా ఉంది. మెట్రో రైలు చార్జీల పెంపు విషయంలో ప్రజల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఈక్రమంలో మెట్రో చార్జీలు పెంచితే ఊరుకోం అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం అవుతోంది.