MMTS రైలుకు కొత్త లుక్

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 03:03 AM IST
MMTS రైలుకు కొత్త లుక్

నగరంలో MMTS రైళ్లకు కొత్త లుక్ వస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లు రావడంతో ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగంగా రైలు బోగీలకు కొత్త కొత్త రంగులు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఎంఎంటీఎస్ రైళ్ల లుక్‌ను మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా కొత్త లుక్‌తో కొన్ని బోగీలు నగరానికి చేరుకున్నాయి. మౌలాలీలోని EMU కార్ షెడ్‌లో కొత్త ఎంఎంటీఎస్ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మార్చి 27వ తేదీ బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు తెలుగు రంగుపై నీలి రంగు స్క్రిప్ట్‌తో ఉన్నాయి. 

మహిళా ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన బోగీలకు గులాబీ రంగు వేయించారు. సీట్ల రూపాన్ని మార్చడం..సీటింగ్ సామర్థ్యం పెంచేశారు. కొన్ని ఆధునిక వసతులు కూడా కల్పించనున్నారు. తమిళనాడులోని పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కలర్ కలర్ బోగీలను తయారు చేయిస్తున్నారు. అధికారులు చేసే సూచనల ఆధారంగా మార్పులు చేర్పులు చేసి పూర్తిస్థాయి కొత్త బోగీలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మరి ఈ న్యూ లుక్ జనాలను ఆకట్టుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.