రేపట్నించి పలు రాష్ట్రాల్లో ఈశాన్య వర్షాలు….29న మరో అల్పపీడనం

  • Published By: murthy ,Published On : October 27, 2020 / 09:53 AM IST
రేపట్నించి పలు రాష్ట్రాల్లో ఈశాన్య వర్షాలు….29న మరో అల్పపీడనం

New Low Pressure bay-bengal Likely To Form Around October 29: IMD : బంగాళాఖాతంలో అక్టోబర్ 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు వివరించారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు తెలిపారు.

కాగా….ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈనెల 28నుంచి పలు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.



రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కాగా.. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ జరిగింది. ఈనెల 28వ తేదీ నాటికి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
https://10tv.in/heavy-rains-another-two-days/