వెదర్ అప్‌డేట్ : రెండు రోజులు వర్షాలు

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 01:45 AM IST
వెదర్ అప్‌డేట్ : రెండు రోజులు వర్షాలు

వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనంతో ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో 2019, జనవరి 27వ తేదీ ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే 28వ తేదీ సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

 

మరోవైపు గడిచిన 24గంటల్లో హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం బీభత్సం చేసింది. జనవరి 26వ తేదీ శనివారం ఉదయం తర్వాత రాత్రి 9.30 నుంచి 11 గంటల మధ్య గంటకు పైగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని పలు ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

* జగిత్యాల జిల్లా ధర్మపురిలో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదు
* సంగారెడ్డి జిల్లా హథనూరులో 4 సెంటీమీటర్లు
* పెద్దపల్లి జిల్లా జూపల్లి 3 సెమీ
* కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
* సిరిసిల్ల, మల్యాల, చేగుట్ట, కోటపల్లి, బెజ్జూరు, గంభీరావు పేట, సారంగాపూర్, రామాయం పేట, ధయేగాన్, భీమినిలలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.