డేటా యుద్ధం : మూడు బృందాలతో విచారణ

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 08:40 AM IST
డేటా యుద్ధం : మూడు బృందాలతో విచారణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేస్తున్న ఐటీ గ్రిడ్స్ కేసులో దర్యాప్తు ఊపందుకొంది. ఈ కేసులో నియమితమైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు మార్చి 07వ తేదీ గురువారం భేటీ అయ్యింది. బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 9 మంది ఈ బృందంలో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్‌కు అందచేయనున్నారు. 

కేసు దర్యాప్తులో భాగంగా మూడు బృందాలుగా విడగొట్టాలని స్టెఫెన్ రవీంద్ర నిర్ణయం తీసుకున్నారు. బృందాలు ఆయా అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నారు. డేటాను విశ్లేషించడం, డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఒక టీం పని చేయనుంది. కేసులో ఉన్న సాక్షులు, అనుమానితులను మరో బృందం విచారించనుంది. కీలక రోల్‌గా ఉన్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌ను పట్టుకోవడానికి ఇంకొక టీమ్ కృషి చేయనుంది. ఇప్పటికే లొంగిపోవాలని అశోక్‌కు సిట్ సూచించింది.  

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ కోసం ఐటీ గ్రిడ్స్ సంస్ధ పని చేస్తోంది. ఏపీలో ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీనిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదం స్టార్ట్ అయ్యినట్లైంది. అమెజాన్ సర్వర్‌లో డేటా నిక్షిప్తమైందని పోలీసులు గుర్తించి సంస్థకు నోటీసులు జారీ చేసింది.