విలీనం చేసే వరకు సమ్మె ఆగదు : అశ్వత్థామరెడ్డి

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 11:32 AM IST
విలీనం చేసే వరకు సమ్మె ఆగదు : అశ్వత్థామరెడ్డి

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు.

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. శుక్రవారం (అక్టోబర్ 25, 2019) ఆర్టీసీ జేఏసీ అత్యవసర భేటీ అయింది. సీఎం కేసీఆర్ ప్రకటనపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. సీఎం కార్మిక కోణంలో చూడాలని.. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కరీంనగర్ లో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తే ఆటోమేటిక్ గా ట్రేడ్ యూనియన్ లు రద్దు అయిపోతాయన్నారు. అప్పుడు చట్టాలు మారిపోతాయన్నారు. టీజీవోలు, టీఎన్ జీవోలకు కూడా ఎన్నికలు లేవన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్ల సమస్య ఉండదన్నారు.

ఎన్నికల గురించి రాజకీయాలు చేయాల్సిన అసవరం తమకు లేదన్నారు. కార్మికుల హక్కుల ప్రయోజనం కోసం, ఆర్టీసీ ప్రజా రావాణ కాపాడేందుకు, ప్రజా రావాణాను బతికించడానికి, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడానికే సమ్మె జరుగుతుందని తెలిపారు. సీఎం కార్మికుల మనోభావాలు దెబ్బతీయకుండా, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని రిక్వెస్ట్ చేశారు.