తెలంగాణ గవర్నర్‌కు ఎక్స్‌ట్రా పవర్స్.. పుదుచ్చేరిలో కూడా

తెలంగాణ గవర్నర్‌కు ఎక్స్‌ట్రా పవర్స్.. పుదుచ్చేరిలో కూడా

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అదనపు బాధ్యతలు అందుకోనున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరికి గవర్నర్ గా కొనసాగుతున్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగించడంతో అక్కడి పాలనా బాధ్యతలు తమిళిసైకి ఇవ్వనున్నారు. ఈ మేర పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఛార్జి తీసుకోనున్నారు.

కిరణ్ భేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2016 మే 22న అపాయింట్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్, డీఎంకే మిత్రపక్షం అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు దాదాపు రెండేళ్ల పాటు ఆ పదవి ఖాళీగానే ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

అప్పుడు కాంగ్రెస్ 15, డీఎంకే 2 సీట్లు గెలిచాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన తర్వాత అక్కడ సీఎం వి.నారాయణస్వామితో తీవ్ర విబేధాలు వచ్చాయి. ఓ దశలో సాక్షాత్తూ సీఎం నారాయణస్వామి రాజ్‌భవన్ ముందు ధర్నా కూడా చేశారు.