డేటా చౌర్యం : అమెజాన్ సర్వర్‌లో ప్రజల డేటా

  • Published By: madhu ,Published On : March 4, 2019 / 11:33 AM IST
డేటా చౌర్యం : అమెజాన్ సర్వర్‌లో ప్రజల డేటా

ఎన్నికల టైం…ఏపీ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్‌ సర్వర్‌లో నిక్షిప్తం కావడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎవరున్నా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. మార్చి 04వ తేదీ సోమవారం ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

ఏపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్ సేవా మిత్రకు ఎలా వస్తాయి ? ప్రభుత్వ డేటాలోని అన్ని వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఉన్నాయని పేర్కొన్న సీపీ అసలు సెన్సిటివ్ డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సేవా మిత్ర సమాచారం అంతా అమెజాన్ సర్వర్‌లో నిక్షిప్తం చేశారని..డేటాను దుర్వినియోగం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని అనుకున్నారనే అనుమానం వ్యక్తం చేశారు సీపీ. 

లబ్ధిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుందని, విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఎన్నాళ్ల నుంచి డేటా వారి దగ్గరుందో దర్యాప్తులో తేలుతుందన్నారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయని.. డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్‌ మెయిల్‌ చేయొచ్చని సీపీ చెప్పారు. 
Also Read : డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని : కేటీఆర్