హైదరాబాద్ మెట్రో బెటర్ : ఎలాంటి అనుమానాలు వద్దు – కేటీఆర్

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 05:58 AM IST
హైదరాబాద్ మెట్రో బెటర్ : ఎలాంటి అనుమానాలు వద్దు – కేటీఆర్

నగరంలోని మెట్రోపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే..తమ ప్రభుత్వం మెట్రోపై చర్యలు తీసుకొంటోందన్నారు. ఇతర నగరాల్లో మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అని, మొత్తం 80 అవార్డులు వచ్చాయన్నారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. సభ్యులు మెట్రోపై పలు ప్రశ్నలు అడిగారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 

ప్రతి రోజు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, చెన్నై మెట్రో ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడుస్తోంది..అయితే ఇప్పటికీ ప్రతి రోజు 70 వేల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. 6 సంవత్సరాల కాలంలో జంట నగరాల్లో 56 కి.మీటర్లు పూర్తి చేసుకుందని..మొత్తం రెండు నెలల్లో 66 కి.మీటర్లు పూర్తవుతందని వెల్లడించారు. ఢిల్లీ మెట్రో మొదటి దశ పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టిందన్నారు. బెంగళూరులో కేవలం 42 కి.మీటర్లు పూర్తి కావడానికి..9 సంవత్సరాలు పట్టిందని..ఇతర నగరాల్లో అమలవుతున్న మెట్రో వివరాలను సభకు వివరించారు. 

మెట్రో రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని, రూ. 10 నుంచి రూ. 60 ఉందని, ఇతర నగరాల్లో ఉన్న రేట్లను వెల్లడించారు. ఆర్టీసీ ఏసీ బస్సులు నడుపుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. అందులో రూ. 15 నుంచి రూ. 80 వసూలు చేస్తున్నారని..తేడాలను గమనించాలని సభ్యులకు సూచించారు. గత కాంగ్రెస్ హాయాంలో 370 కోర్టు కేసులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో 360 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మొత్తం 14 వేల 132 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనా వేసిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా పొందుపరిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే తాము అవలంబించామన్నారు. 50 శాతం పెట్టుబడి తిరిగి తెచ్చుకొనే విధంగా గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. 

గన్ పార్కును పడగొట్టవద్దని ఆనాడు కేసీఆర్ చెప్పారని..కానీ మూడు మార్గాల గుండా..ప్రజల ఆకాంక్షలకనుగుణంగా తాము అధ్యయనం చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ నుంచి మెట్రో రైలు రావాలంటే..గన్ పార్కు పడగొట్టాలని గత ప్రభుత్వం చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహాల్‌కు, గన్ పార్కుకు నష్టపోకుండా ఉండేందుకు అసెంబ్లీ నుంచి మెట్రో రైలును ప్రతిపాదించడం జరిగిందన్నారు. సుల్తాన్ బజార్ గుండా మెట్రో రైలు వెళ్లేందుకు తమ ప్రభుత్వం అందరితో చర్చించి..ఆమోదం తీసుకున్నామని మంత్రి కేటీఆర్ సభలో వెల్లడించారు. 
Read More : పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్