అందరికీ ఇళ్లు, నీళ్లు, హెల్త్ కార్డులు : గజ్వేల్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 09:31 AM IST
అందరికీ ఇళ్లు, నీళ్లు, హెల్త్ కార్డులు : గజ్వేల్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని

తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని చెప్పారు. గజ్వేల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. గజ్వేల్ నుంచే హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు. పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. గజ్వేల్ లో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదు అన్నారు. 

పార్టీలు, పైరవీలు అనేది లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. బుధవారం(డిసెంబర్ 11,2019) గజ్వేల్ లో పర్యటించిన సీఎం కేసీఆర్..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహతి ఆడిటోరియంను ప్రారంభించారు. త్వరలోనే ఒక రోజుంతా గజ్వేల్ ప్రజలతో ఉంటాను అని చెప్పిన సీఎం.. నియోజకవర్గ సమస్యలపై ఆ రోజంతా చర్చిద్దామన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తామన్నారు.

* జనవరిలో గోదావరి జలాల పండగ
* గజ్వేల్ కు కాళేశ్వరం నీళ్లు
* అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
* గజ్వేల్ నుంచి హెల్త్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం
* ప్రతీ ఇల్లు పాడిపరిశ్రమలతో కళకళలాడాలి
* గజ్వేల్ అభివృద్ధికి ప్రణాళిక
* గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక నమోదు
* ప్రతీ కుటుంబానికి ఏదో ఒక పని కల్పించేలా చర్యలు
* స్వయం సమృద్ధే లక్ష్యం
* హరితహారంతో దేశానికే ఆదర్శంగా గజ్వేల్
* గజ్వేల్ లో ఇల్లు లేని కటుంబం ఉండకూడదు
* రాజకీయాల్లో ఉన్న వారు ఎప్పుడూ రిలాక్స్ కాకూడదు