కేసీఆర్ రంజాన్ తోఫా : మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లు, రూ.లక్ష నగదు

తెలంగాణ ప్రభుత్వం రంజాన్‌ కానుక ప్రకటించింది. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయనుంది. అలాగే ఇఫ్తార్‌

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 08:10 AM IST
కేసీఆర్ రంజాన్ తోఫా : మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లు, రూ.లక్ష నగదు

తెలంగాణ ప్రభుత్వం రంజాన్‌ కానుక ప్రకటించింది. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయనుంది. అలాగే ఇఫ్తార్‌

తెలంగాణ ప్రభుత్వం రంజాన్‌ కానుక ప్రకటించింది. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయనుంది. అలాగే ఇఫ్తార్‌ విందు కోసం ప్రతి మసీదుకి రూ.లక్ష మంజూరు చేయనుంది. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రంజాన్‌ పండుగ ఏర్పాట్లపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్‌ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదుల దగ్గర తాగునీటి వసతికి మెట్రో వాటర్‌ బోర్డు సహకారం తీసుకోవాలన్నారు.

విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రంజాన్‌ పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. మే నెల మొదటి వారంలో రంజాన్ మాసం, ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఎలాంటి అవాంతరాలు కలగకుండా రంజాన్ మాసం జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.