గప్ చుప్ : 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 02:09 PM IST
గప్ చుప్ : 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సమాప్తం

ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం 
రెండో విడతలో మొత్తం 4,135 గ్రామపంచాయతీలకు ఎన్నికలు
5 గ్రామపంచాయతీలకు దాఖలు కాని నామినేషన్లు 
788 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం 

హైదరాబాద్ : తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడతలో మొత్తం 4 వేల 135 గ్రామపంచాయతీలు ఉండగా.. 5 గ్రామపంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3వేల 342 గ్రామాలకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 10వేల 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 36 వేల 602 వార్డులకు గాను 94 వార్డుల్లో నామినేషన్‌ దాఖలు కాలేదు. 10 వేల 317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 26 వేల 191 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 63 వేల 480 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేయనున్నారు. 
3,342 గ్రామాలకు ఈ నెల 25న ఎన్నికలు 
ఎన్నికల బరిలో ఉన్న 10,668 మంది అభ్యర్థులు 
36,602 వార్డులకు గాను 94 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్‌ 
10,317 వార్డులు ఏకగ్రీవం 
26,191 వార్డులకు జరగనున్న ఎన్నికలు 
63,480 మంది అభ్యర్థులు పోటీ 
ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేత