సూర్యతేజనే కారణమా ? : దొరికిన ఝాన్సీ డైరీ

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 10:10 AM IST
సూర్యతేజనే కారణమా ? : దొరికిన ఝాన్సీ డైరీ

హైదరాబాద్ :  బుల్లితెర యాక్టర్ నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. సూసైడ్ ఎందుకు చేసుకుంది ? దీనికి గల కారణాలేంటీ ? అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా ఓ డైరీ బయటపడింది. ఈ డైరీలో ప్రియుడు సూర్య తేజ గురించి ఝాన్సీ రాసుకుంది. సూర్యతో ఉన్న అనుబంధం పేర్కొంది. దీనితో డైరీని స్వాధీనం చేసుకుని ఈ కోణంలో సూర్యను విచారిస్తున్నారు. ఇప్పటికే అతను పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. 

ఆమెతో ప్రేమలో ఉన్నట్లు సూర్యతేజ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఇక్కడ ఝాన్సీ ఇతరులతో సన్నిహితంగా మెలిగేదని..దీనితో తాను దూరం పెట్టినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్యతేజ హస్తం ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.  

తమ కూతురు ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సూర్యేనని…వేధింపులు తట్టుకోలేక పోయిందని..ఆమె ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఝాన్సీకి సంబంధించిన ఓ వీడియో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈమెకు సంబంధించిన ఓ ఫోన్ లాక్ ఓపెన్ అయితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది  ? దీనికి కారకుడు సూర్యతేజనా ? ఇతరత్రా విషయాలు కొద్ది రోజుల్లోనే బయటపడనున్నాయి.