మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే వాదన వినిపిస్తున్న తరుణంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఆమె చెప్పింది. నాన్న పోతారని ఎవరూ ఊహించలేదని, గొప్ప మనిషిని దూరం చేసుకున్నందుకు మేం బాధలో ఉన్నామని ఆమె అన్నారు.

అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమె తన దగ్గరే ఉందని, పులివెందుల లో నాన్న ఒక్కడే ఉండేవారిని, ఆయన చనిపోయిన తర్వాత మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వస్తున్న వార్తలు  చాలా బాధపెడుతున్నాయని ఆమె చెప్పింది. నాన్న పోవడం ఎవరూ ఊహించలేదని, అయితే రాజకీయంగా డిగ్నిటీ లేకుండా కొందరు వ్యక్తులు లూజ్ టాక్ చేయడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది.
Read Also :దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

కుటుంబం అన్నాక కొన్ని గొడవలు ఉంటాయని, మా కుటుంబంలో 700మంది ఉన్నారని, ఇంతమందిలో కొన్ని విభేదాలు ఉండడం సహజమేనని, చంపుకునేంత గొడవలు మాత్రం తమ మధ్య లేవని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. జగన్‌ అన్నను సీఎం చేయాలని వివేకానంద గారు తపన పడ్డారని, ఆయనును ముఖ్యమంత్రిగా చేసే లక్ష్యంతో పని చేసేవారని, ఆయన పోయాక ఆయనను అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇంత చెడుగా మాట్లాడుతారా? రాస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి కిరాతకపనిని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా? సిట్ వేసి మళ్లీ రాజకీయంగా కామెంట్లు చేస్తూ.. విచారణకు ముందే కంక్లూజన్‌లు ఇస్తే ఎలా? ఇలా చేస్తే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఊహాగానాలు ఎందుకని, అటువంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. చనిపోయిన వ్యక్తి మీద నిందలు వేస్తుంటే ఆయన ఫ్యామిలీగా తట్టుకోలేకపోతున్నామని.. ఆయనను అవమానించకండి అంటూ మీడియాకు సూచించింది సునీత.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

×