బీ అలర్ట్ : నేడు రేపు ఈదురుగాలులు

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 02:06 AM IST
బీ అలర్ట్ : నేడు రేపు ఈదురుగాలులు

రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు ఎండలు కూడా మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఉక్కపోత ఉంటోంది. అయితే..పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఏప్రిల్ 08వ తేదీ సోమవారం, ఏప్రిల్ 09వ తేదీ మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండంలలో 41 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.