తెలంగాణలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుస్తారని జోరుగా ప్రచారం.. నిజం ఏంటంటే..

కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 03:22 PM IST
తెలంగాణలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుస్తారని జోరుగా ప్రచారం.. నిజం ఏంటంటే..

కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్

కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో జనాలు కన్ ఫ్యూజ్ అవుతున్నారు. అది నిజమేనేమో అని కంగారుపడుతున్నారు. ఇప్పటికే అనేక ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యాయి. తాజాగా కరోనా వైరస్ గురించి లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా రాదు అంటూ ఎవరికి వారు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు మరో న్యూస్ పుట్టించి దాన్ని వైరల్ చేశారు. అదేమిటంటే, తెలంగాణలో రేపటి నుంచి వైన్స్ షాపులు తెరుస్తారట. ఇదీ న్యూస్. దీన్ని ఎవరు క్రియేట్ చేశారో కానీ, వైరల్ గా మారింది. 

మద్యం షాపులు తెరుస్తారని జోరుగా ప్రచారం:
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపులు కూడా మూతపడ్డాయి. మద్యం దొరక్క మందుబాబులు తెగ పరేషాన్ అవుతున్నారు. మందు కోసం విలవిలలాడిపోతున్నారు. కొందరు మతిస్థిమితం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే నిజం అనుకుని చాలామంది దీన్ని షేర్ చేస్తున్నారు. కొందరు మందు బాబులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఆ వార్త ఫేక్ అని, ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు:
దీనిపై ఎక్సైజ్ డీఎస్పీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపటి నుంచి వైన్స్ షాపులు తెరుస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం(మార్చి 29,2020) మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారం అవుతోంది. ప్రభుత్వ జీవోను తయారు చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.

మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదు:
లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్కులేట్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ తన ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్న వారిని పట్టుకునే పనిలో పడ్డారు. వారిని పట్టుకుని బెండు తీస్తామన్నారు. బాధ్యులపై ఫోర్జరీ కేసు పెడతామన్నారు. మొత్తంగా రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తారనే ప్రచారం అవాస్తవం అని ఎక్సైజ్ శాఖ తేల్చింది.