Watch viral video: యువతికి గుండు చేశాక భావోద్వేగంతో తానూ గుండు చేసుకున్న క్షౌరకుడు

Watch viral video: యువతికి గుండు చేశాక భావోద్వేగంతో తానూ గుండు చేసుకున్న క్షౌరకుడు

Watch viral video

Watch viral video: ఓ మహిళకు గుండు చేశాక భావోద్వేగానికి గురై తానూ స్వయంగా గుండు చేసుకున్నాడు ఓ క్షౌరకుడు? ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హాయిగా సాగిపోతున్న కొందరి జీవితంలోకి అనుకోని ఉపద్రవంవా వస్తుందని క్యాన్సర్. ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. క్యాన్సర్ సోకిన ఓ యువతి చికిత్స చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గుండు చేయించుకోవడానికి కటింగ్ షాపునకు వెళ్లింది.

క్షౌరకుడు గుండు చేస్తుండగా ఆమె కన్నీరు పెట్టుకుంది. దీంతో ఆమెకు గుండు చేసిన క్షౌరకుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం ఆమెకు సంఘీభావంగా తానూ గుండు చేసుకున్నాడు. ఈ దృశ్యాన్నింటినీ ఒకరు కెమెరాలో నిక్షిప్తం చేశారు. గుండ్ న్యూస్ మూవ్‌మెంట్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

అమ్మాయిలు జుట్టును ఎంతో ఇష్టంగా పెంచుకుంటారని, తమ అందం అంతా అందులోనే ఉందని భావిస్తారని, అటువంటిది ఇక జుట్టును పెంచుకోలేననే బాధ ఈ యువతిలో కనపడిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమేనని, ఆమె క్యాన్సర్ ను జయించాలని తాను కోరుకుంటున్నానని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

Viral Pic: కోటాలో కచోరీలు తిన్న మహిళ.. ‘ఏ పేపర్‌లో పెట్టిచ్చారో చూడండి’ అంటూ ట్వీట్