Viral Pic: కోటాలో కచోరీలు తిన్న మహిళ.. ‘ఏ పేపర్‌లో పెట్టిచ్చారో చూడండి’ అంటూ ట్వీట్

Viral Pic: కోటాలో కచోరీలు తిన్న మహిళ.. ‘ఏ పేపర్‌లో పెట్టిచ్చారో చూడండి’ అంటూ ట్వీట్

Viral Pic

Viral Pic: రాజస్థాన్ లోని కోటా గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం ఉండదు. ఔఐటీ-జేఈఈ పరీక్షలు రాయాలనుకునే వారికి ఆ ప్రాంతం కేంద్రంగా మారింది. అక్కడికెళ్లి శిక్షణ తీసుకుంటారు. గత 15 ఏళ్లలో అక్కడ ఎన్నో కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్లు వెలిశాయి. ఆ ప్రాంతం అంతా చదువుమయంగా ఉంటుందని అంటారు.

ఆ ప్రాంతంలో పాత, కొత్త పుస్తకాలకు కొరత లేదు. విద్యార్థులు వాడి పాడేసిన పాత పేపర్లను దుకాణాల్లో పొట్లాలు కట్టడానికి వినియోగించుకుంటున్నారు. రీసైకిల్ చేసి పేపర్లను హోటళ్లలో వాడుతున్నారు. తాజాగా, ఓ ట్విట్టర్ యూజర్ కోటాలో కచోరీ తిని, ఈ సందర్భంగా ఓ విషయాన్ని గమనించి ఓ ఫొటో పోస్ట్ చేశారు. తాను కోటా రైల్వే స్టేషన్లో కచోరీ తినగా, దాన్ని తనకు ఓ పేపర్ లో ఇచ్చారని, అది రసాయన శాస్త్రానికి చెందిన పేపర్ అని చెప్పారు.

ఆ పేపర్ లో రసాయన శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు ఉండడం మనం చూడొచ్చు. అది ఓ పరీక్ష పేపర్ అని తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులకు రసాయన శాస్త్ర ప్రశ్న పేపర్ అంటే భయం ఉంటుందని, ఇప్పుడు దాన్ని ఇలా వాడుకుంటుండడం చూసి వారు సంతోషిస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తింటూ చదువుకునే అవకాశం కోటాలో మాత్రం లభిస్తుందని మరో యూజర్ పేర్కొన్నాడు.


Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఒకేఒక్క పర్సన్ సుమ.. మూడేళ్లు మెసేజ్ లు చేసినా పట్టించుకోలేదు..