COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,230 మందికి కొవిడ్

దేశంలో చాలా కాలం తర్వాత కరోనా కేసులు 4 వేల దిగువన నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. భారత్ లో కొత్తగా 3,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 4,255 మంది కోలుకున్నారని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.58 శాతంగా ఉందని తెలిపింది.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,230 మందికి కొవిడ్

India's Active caseload

COVID-19: దేశంలో చాలా కాలం తర్వాత కరోనా కేసులు 4 వేల దిగువన నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. భారత్ లో కొత్తగా 3,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 4,255 మంది కోలుకున్నారని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.58 శాతంగా ఉందని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 42,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,40,04,553గా ఉన్నాయని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 217.82 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు చెప్పింది.

వాటిలో రెండో డోసు వ్యాక్సిన్లు 94.79 కోట్లు, బూస్టర్ డోసు వ్యాక్సిన్లు 20.56 కోట్లు ఉన్నాయని తెలిపింది. నిన్న దేశంలో 14,08,253 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది. దేశంలో మొత్తం కలిపి 89.41 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. నిన్న 2,74,755 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ