J P Nadda: ఘర్షణలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: జేపీ నద్దా

ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు J P Nadda విమర్శించారు. ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

J P Nadda: ఘర్షణలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: జేపీ నద్దా

J P Nadda

J P Nadda:ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా విమర్శించారు. శ్రీరామ నవమితోపాటు, హనుమాన్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఇరు
వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శిస్తూ, ప్రతిపక్షాలకు చెందిన కొన్ని పార్టీలు ప్రధాని మోదీకి ఇటీవల ఉమ్మడిగా లేఖ రాశాయి. ప్రతిపక్షాల లేఖపై జేపీ నద్దా విమర్శలు గుప్పించారు.

BJP MLA Raja Singh : డీజీపీ, హైదరాబాద్ సీపీ ఏం చేస్తున్నారు? రాజాసింగ్ ఆగ్రహం

సోమవారం ఆయన ప్రతిపక్షాలను విమర్శిస్తూ, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేశ స్ఫూర్తిని, సమైక్యతను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు మరోసారి ఏకమయ్యాయని లేఖలో విమర్శించారు. ఈ నెల 2న రాజస్తాన్‌లోని కరోల్‌లో హిందూ నూతన సంవత్సరం సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీపై ఒక వర్గం జరిపిన దాడిని ప్రతిపక్షాలు ఎందుకు మర్చిపోయాయని నద్దా ప్రశ్నించారు. ‘‘దేశ యువత అవకాశాల్ని కోరుకుంటోంది. అవరోధాల్ని కాదు. అభివృద్ధిని కోరుకుంటోంది. విభజనని కాదు. పార్టీలు తమ వైఖరి మార్చుకుని అభివృద్ధికి సహకరించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్

1996లో గోవధను నిషేధించాలని కోరుతూ కొందరు సాధువులు పార్లమెంటు వెలుపల చేపట్టిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటనను నద్దా గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హత్య సందర్భంగా సిక్కుల ఊచకోతను సమర్ధిస్తూ, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా నద్దా ప్రస్తావించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో జరిగిన హింసను ఆయన గుర్తు చేశారు.