Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం

Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం

School girls Wear Hijab

భోపాల్ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది.మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల తన బోర్డు పరీక్షల్లో టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది బాలికలు హిజాబ్ ధరించడం వివాదం రేపింది.(Hijab)పాఠశాల విద్యార్థినులు(Schoolgirls) హిజాబ్ ధరించారని ఆరోపించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ దీనిపై విచారణకు ఆదేశించింది. పాఠశాలలో బాలికలు హిజాబ్ ధరించమని(Wear Hijab) బలవంతం చేశారని ఆరోపిస్తూ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టరును ఆరా తీశారు. మే 30వతేదీన తమకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, దీనిపై దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థినుల కుటుంబాలను కలిశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ హిజాబ్ వివాదంపై తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు చెప్పారు. పాఠశాల అమ్మాయిల స్కూల్ డ్రెస్ కోడ్‌లో స్కార్ఫ్‌లు, సల్వార్, కుర్తా ఉంటాయి’’ అని ఒక విద్యార్థిని చెప్పారు.

NCP chief Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం షిండే,గౌతంఅదానీల రహస్య భేటి

గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్,ఏబీవీపీ సహా మితవాద సంఘాలు దామోహ్‌లో నిరసన తెలిపాయి.‘‘పాఠశాలలో అమ్మాయిలు హిజాబ్ ధరించలేదు, వారు స్కార్ఫ్‌లు ధరించారు, ఇది పాఠశాల దుస్తుల కోడ్‌లో భాగం. హిజాబ్ మొత్తం శరీరాన్ని కప్పివేసినప్పుడు, కండువా ఛాతీ వరకు ఉంటుంది. మేం ఏ విద్యార్థినీ ఏదైనా ధరించమని బలవంతం చేయలేదు’’ అని పాఠశాల డైరెక్టర్ ముస్తాక్ మహ్మద్ చెప్పారు.పాఠశాలలో హిజాబ్ వివాదంపై విచారణకు(Madhya Pradesh Orders Probe) ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. తాము ఇప్పటికీ హిజాబ్ విషయంపై లోతైన విచారణ జరపాలని దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కోరామని మంత్రి మిశ్రా చెప్పారు.

పాఠశాలలో హిజాబ్ వ్యవహారంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విచారణకు ఆదేశించారు.‘‘విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేని దుస్తులు ధరించమని ఏ పాఠశాల కూడా ఏ అమ్మాయిని బలవంతం చేయదు. దామోహ్ పాఠశాల విషయం నా దృష్టికి వచ్చింది, ఆ తర్వాత నేను విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించాను. విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ చెప్పారు.