NCP Pawar Vs Pawar: మహారాష్ట్ర ఎన్సీపీలో ‘ప’వార్ గేమ్

మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పవర్ గేమ్ నడుస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాక బుధవారం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు జరిగాయి.....

NCP Pawar Vs Pawar: మహారాష్ట్ర ఎన్సీపీలో ‘ప’వార్ గేమ్

NCP Pawar Vs Pawar

NCP Pawar Vs Pawar : మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాక బుధవారం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు జరిగాయి. శరద్ పవార్ వర్గం నిర్వహించిన సభా వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేల్లో జితేంద్ర అవద్, కిరణ్ లహమాటే, అశోక్ పవార్, రోహిత్ పవార్, దేవేంద్ర భుయార్, రాజేంద్ర షింగ్నే, అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నారు. (Who Is Attending Which Meeting) వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ఆదివారం అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఎంపీలు సుప్రియా సూలే, శ్రీనివాస్ పాటిల్ కూడా వేదిక వద్దకు చేరుకున్నారు.

Raj Thackeray : ఎన్సీపీలో చీలిక వెనుక శరద్ పవార్ హస్తం.. రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

అజిత్ పవార్ శిబిరం సమావేశంలో చుగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, ధర్మారావు అత్రమ్, అన్నా బన్సోడే, మాణిక్‌రావ్ కొకటే, సునీల్ షెల్కే, నీలేష్ లంకే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్, దిలీప్ వాల్సే పాటిల్, రాంరాజే నాయక్ నింబాల్కర్, దత్తాత్రే భార్నీ,ఆదితిలు పాల్గొన్నారు. తమకు 42మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెబుతున్నా ఆయన వర్గ సమావేశంలో 29 మంది మాత్రమే ఉన్నారని సమాచారం. అజిత్ వర్గానికి 36 మంది సభ్యుల మద్ధతు ఉంటేనే వారిపై అనర్హతవేటు పడదు.

Ajit Pawar faction : మా వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది…అజిత్ పవార్ వర్గం ప్రకటన

శరద్ పవార్ వర్గం తమకు 15 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెబుతోంది. మొత్తంమీద ఎన్సీపీలో తిరుగుబాటు పర్వం రెండు వర్గాల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్సీపీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరియు పార్టీ అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మరమ్మతులు ,తయారీని ప్రారంభించాలని కేంద్రం మహారాష్ట్ర అధికారులను ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు 2023 డిసెంబరు నెలలోనే జరగవచ్చని రోహిత్ పవార్ చెప్పారు.