Cheetas arriving from Namebia: భారత్‌లో అడుగుపెట్టిన 8 చీతాలు.. స్వాగతం పలికిన జ్యోతిరాదిత్య.. వీడియో

 నమీబియాలోని విండ్‌హోక్‌ విమానాశ్రయం నుంచి బీ747 జంబో జెట్‌ విమానంలో నిన్న రాత్రి బయలుదేరిన ఎనిమిది చీతాలు భారత్‌ చేరుకున్నాయి. ఆ ఐదు ఆడ, మూడు మగ చీతాలకు గ్వాలియర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఓ జాతీయ మీడియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాసేపట్లో హెలికాప్టర్లలో ఆ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు.

Cheetas arriving from Namebia: భారత్‌లో అడుగుపెట్టిన 8 చీతాలు.. స్వాగతం పలికిన జ్యోతిరాదిత్య.. వీడియో

Cheetas arriving from Namebia

Cheetas arriving from Namebia: నమీబియాలోని విండ్‌హోక్‌ విమానాశ్రయం నుంచి బీ747 జంబో జెట్‌ విమానంలో నిన్న రాత్రి బయలుదేరిన ఎనిమిది చీతాలు భారత్‌ చేరుకున్నాయి. ఆ ఐదు ఆడ, మూడు మగ చీతాలకు గ్వాలియర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఓ జాతీయ మీడియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాసేపట్లో హెలికాప్టర్లలో ఆ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు.

ఆ చీతాల వయసు నాలుగు-ఆరేళ్ల మధ్య ఉంటుంది. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్కులోకి విడిచిపెడతారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అంతరించిపోయిన ఆ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ చీతా’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును మొదట సుప్రీంకోర్టు నిలిపివేసినా.. 2020 జనవరిలో మళ్ళీ ఆమోద ముద్ర వేసింది. చీతాల సంరక్షణ విషయంలో ఈ ఏడాది జూలై 20న నమీబియాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది.