Chinese nationals attacked: పాకిస్థాన్‌లో చైనీయులపై కొనసాగుతున్న దాడులు.. మరోసారి కాల్పులు.. ఒకరి మృతి

 పాకిస్థాన్‌లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ దంత వైద్యశాలలో చైనీయులపై ఓ వ్యక్తి (30) కాల్పులు జరిపాడు. దీంతో ఓ చైనీయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తో చైనా సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటూ అంతర్జాతీయంగా పాక్ కు వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే, చైనా వల్ల పాక్ కు ప్రమాదం పొంచి ఉంటుందని పాకిస్థాన్ లోని పలు వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.

Chinese nationals attacked: పాకిస్థాన్‌లో చైనీయులపై కొనసాగుతున్న దాడులు.. మరోసారి కాల్పులు.. ఒకరి మృతి

Chinese nationals attacked: పాకిస్థాన్‌లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ దంత వైద్యశాలలో చైనీయులపై ఓ వ్యక్తి (30) కాల్పులు జరిపాడు. దీంతో ఓ చైనీయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తో చైనా సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటూ అంతర్జాతీయంగా పాక్ కు వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే, చైనా వల్ల పాక్ కు ప్రమాదం పొంచి ఉంటుందని పాకిస్థాన్ లోని పలు వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.

పాక్ లో చైనా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, పాక్ ను చైనా అప్పులు ఊబిలోకిలాగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో చైనీయులే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. తాజాగా చైనీయుపై జరిగిన దాడిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి పేరు రోనాల్డ్ చో అని, గాయపడ్డ వారి పేర్లు రిచర్డ్ హు లీ (74), మార్గరెట్ (72) అని వివరించారు. వైద్యుడి గదిలోనే ఈ కాల్పులు జరిగాయని అన్నారు.

అక్కడ తుపాకీ కూడా లభ్యమైందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ ప్రకటన చేయలేదు. పాక్ లో చైనా వ్యక్తులు వ్యాపారాలు చేస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. వైద్యుడు, అతడి భార్యపై ఉన్న గొడవల కారణంగానే ఓ వ్యక్తి కాల్పులు జరిపాడా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో కరాచీ యూనివర్సిటీలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు చైనీయులు మృతి చెందారు.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం