కరోనా గుర్తించటానికి మరో 6 కొత్త లక్షణాలు

కరోనా వైరస్ సోకిన మనిషికి జ్వరం రావటం...పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఇలాంటి లక్షణాలు వల్ల వ్యాధికి గురయైనవారిని గుర్తించేవారు.గొంతు మంటపుడుతుంది

కరోనా గుర్తించటానికి మరో 6 కొత్త లక్షణాలు

కరోనా వైరస్ సోకిన మనిషికి జ్వరం రావటం…పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఇలాంటి లక్షణాలు వల్ల వ్యాధికి గురయైనవారిని గుర్తించేవారు.గొంతు మంటపుడుతుంది. తలనొప్పి వస్తుంది. నీళ్ల విరేచనాలు కూడా జరగొచ్చు. ఈ వైరస్ సోకినవారు వాసన, రుచి గ్రహించే శక్తి కోల్పోవచ్చు.వీటిలో కొన్ని లక్షణాలు ఉన్నా అలర్టై పరీక్షలు చేయించుకుంటున్నారు ప్రజలు ఇప్పటి వరకు.  ఇవి కాకా మరి కొన్ని లక్షణాలు కూడా వ్యాధి సోకిన వారిలో కనిపిస్తున్నాయంటున్నారు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్లు .  కరోనా  రోగ లక్షణాలు గుర్తించటానికి  కొత్తగా మరో ఆరింటిని చేర్చారు. ఈ లక్షణాలు కనపడినా తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

సీడీసీ కొత్తగా చెప్పిన 6 లక్షణాలు ఏంటంటే 
చలిగా అనిపించటం
వణుకు
కండరాల నొప్పి
తలనొప్పి
వాసన గ్రహించలేకపోవటం
గొంతు నొప్పిగా ఉండి మంటపుట్టటం   వంటి లక్షణాలు కనపడినా డాక్టర్ను  సంప్రదించమని సీడీసీ సూచించింది.

కరోనా సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న దానిపై స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన వైద్య బృందం సీడీసీ తరఫున సర్వే నిర్వహించింది. వారి సర్వేలో చాలా మంది తమకు కరోనా పాజిటివ్‌ అని తేలకముందు ఇలాంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు.  ఈ లక్షణాలు 2 రోజుల నుంచి 14 రోజుల లోపల బయటపడే అవకాశం ఉందని సీడీసీ చెప్పింది.