Ukraine Children deaths: యుక్రెయిన్ ప్రజలపై రష్యా దాష్టికం.. 115 మంది చిన్నారులు మృతి

రష్యా సైనికుల దాష్టికానికి యుక్రెయిన్ లో ఇప్పటివరకు 1400 మందికి పైగా సాధారణ పౌరులు మృతి చెందిఉంటారని ఆదేశాధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో 115 మంది చిన్నారులే

Ukraine Children deaths: యుక్రెయిన్ ప్రజలపై రష్యా దాష్టికం.. 115 మంది చిన్నారులు మృతి

Russia Ukriane

Ukraine Children deaths: యుక్రెయిన్ రష్యా యుద్ధం 25వ రోజు కొనసాగుతుంది. యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఇప్పటికే పూర్తిగా ధ్వంసం చేసిన రష్యా సేనలు..ప్రజలపైనా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. యుద్ధ భీతితో తలదాచుకున్న అమాయక ప్రజలపై.. రష్యా సేనలు కావాలనే దాడులు చేస్తున్నాయి. రష్యా సైనికుల దాష్టికానికి యుక్రెయిన్ లో ఇప్పటివరకు 1400 మందికి పైగా సాధారణ పౌరులు మృతి చెందిఉంటారని ఆదేశాధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో 115 మంది చిన్నారులే ఉన్నట్లు యుక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించింది. “రష్యా సేనల కర్కశత్వానికి అభంశుభం తెలియని 115 మంది చిన్నారులు మృతి చెందారు, ఇది కేవలం ఒక సంఖ్యమంత్రమే కాదు..వందలాది ఉక్రేనియన్ కుటుంబాల దుఃఖం విలువ మరియు విచ్ఛిన్నమైన విధి” అంటూ యుక్రెయిన్ పార్లమెంటు పేర్కొంది.

Also read: Russia Ukraine War: యుక్రెయిన్ పై రష్యా హైపర్ ఎటాక్

యుక్రెయిన్ పై రష్యా సేనల అమానవీయ చర్యలు ఎలా ఉన్నాయంటే.. గత వారం పశ్చిమ కీవ్ లో తలదాచుకున్న కొందరు ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో రష్యా సేనలు తుపాకులతో సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. రష్యా సైనికుల దాడిలో తొమ్మిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆ చిన్నారి చేతిని తొలగించారు. తృటిలో ప్రాణాలు తక్కించుకున్న ఆ చిన్నారి.. అక్కడ జరిగిన సంఘటనను వర్ణించిన తీరు రష్యా సేనల రాక్షసత్వానికి అద్దం పడుతుంది.

Also read: Russia Ukraine War: స్విట్జర్లాండ్ కు జెలెన్ స్కీ రిక్వెస్ట్

చిన్నారి తెలిపిన వివరాలు మేరకు..తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న తమపై రష్యా సైనికులు దాడి చేశారని, ఆ సమయంలో తన తండ్రి శరీరం నిండా తుపాకీ గుళ్ళు గుచ్చుకున్నాయని.. ఒక బులెట్ తన చేతికి తగలడంతో.. నొప్పితట్టుకోలేక తన సోదరి వద్దకు పెరిగెత్తానని ఆ చిన్నారి చెప్పుకొచ్చింది. అనంతరం కొందరు వ్యక్తులు తనను దుప్పట్లో చుట్టి ఆసుపత్రికి తీసుకువచ్చారని.. ఇక్కడి వైద్యులు తన చేతిని తొలగించారని తొమ్మిదేళ్ల చిన్నారి తన కళ్లెదుట జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. “రష్యన్లు నన్ను ఎందుకు కాల్చారో నాకు తెలియదు. ఇది ప్రమాదవశాత్తు జరిగినదని మరియు వారు నన్ను బాధపెట్టాలని అనుకోలేదని నేను ఆశిస్తున్నాను” అంటూ అమాయకంగా ఆ చిన్నారి చెప్పిన మాటలు విని ఆసుపత్రి సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఒక్క సంఘటన చాలు యుక్రెయిన్ ప్రజలపై రష్యా సైనికుల క్రూరత్వానికి అద్దం పడుతుంది.

Also read: Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌