బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమం ? బతికే ఉన్నామంటున్నారు

బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమం ? బతికే ఉన్నామంటున్నారు

China gold mine: చైనాలో కూలిన బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఈ గని కూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారంతా..చిక్కుకపోయారు. అనేక మంది కార్మికులు చిక్కుకున్నారు. పది మంది జాడ తెలియరాలేదు. అయితే..12 మంది కార్మికులు సజీవంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. తమకు ఆహారం, మందులు పంపించాలంటూ..కార్మికులు సందేశం పంపారు.

గనిలో భారీ పేలుడు వల్ల ప్రవేశ ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. గనిలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నాశనం కావడంతో..సమస్యలు ఏర్పడ్డాయి. ఓ చిన్న రంధ్రం ద్వారా ఆహారం, మందులు, పేపర్, పెన్సిళ్లను లోనికి పంపించారు. పెయిన్ కిల్లర్స్ కావాలంటూ..వాళ్లు లేఖ ద్వారా పంపారు. గని ప్రవేశ ద్వారం నుంచి సుమారు 600 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు..గని కూలిన ఘటన ఓ రోజు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ఆలస్యంగా జరిగాయి. సంఘటన జరిగిన తర్వాత..నివేదిక అందించడంలో తాత్సారం చేసిన స్థానిక అధికారులపై వేటు పడింది.