Zimbabwe Man: 16 మంది భార్యలు, 151 మంది సంతానం.. 17వ పెళ్ళికి సిద్ధం

ఒక్క పెళ్లి చేసుకోడానికి చాలామంది నానాతంటాలు పడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఒక్కరిద్దరు పిల్లలను కని చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని సందేశాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏకంగా 16 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

Zimbabwe Man: 16 మంది భార్యలు, 151 మంది సంతానం.. 17వ  పెళ్ళికి సిద్ధం

Zimbabwe Man

Zimbabwe Man: ఒక్క పెళ్లి చేసుకోడానికి చాలామంది నానాతంటాలు పడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఒక్కరిద్దరు పిల్లలను కని చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని సందేశాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏకంగా 16 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు 17 పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక 16 మంది భార్యలకు 151 మంది సంతానం ఉన్నారు.

జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ అనుభవజ్ఞుడైన మిషెక్ న్యాన్డోరో బహుభార్యత్వ విధానంతో మొదట స్థానంలో నిలిచాడు. ఇక ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం ఇబ్బంది అనిపించలేదా అంటే.. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు.. ఇంతమంది పిల్లలను పోషించడం కష్టమని అనుకుంటారు. కానీ తన పిల్లల్లో పెద్దవాళ్ళు సంపాదించి కుటుంబ పోషణకు డబ్బు ఇస్తారని, తన పని భార్యలను సంతృప్తిపరచడమే అని చెబుతున్నాడు.

16 మంది భార్యలు తనకు భోజనం వండుతారని ఎవరి ఆహారం రుచిగా ఉంటే వారిదే తింటానని మిగతావి తిప్పి పంపుతానని చెప్పాడు న్యాన్డోరో. తన జీవితకాలంలో 100 మందిని పెళ్లి చేసుకొని 1000 మంది పిల్లలను కనడమే లక్ష్యమని తెలిపాడు. తానూ చనిపోయే లోపు తను అనుకున్న లక్ష్యం పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు న్యాన్డోరో. వివాహానికి ముందే తన లక్ష్యం గురించి పెళ్లి చేసుకోబోయే వారికి చెబుతాడు న్యాన్డోరో.

వారి అంగీకారంతోనే ఇంతమందిని వివాహం చేసుకున్నాడు. రోజంతా భార్యలని సంతృప్తిపరచడానికే కేటాయిస్తాను’’ అని తెలిపాడు. ఈ ఏడాది చివరి వరకు 17 పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అందరు భార్యల ఇష్టంతోనే తాను పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు వివరించాడు న్యాన్డోరో.