Canada : పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు

మూసి ఉన్న పాఠశాల ప్రాంతంలో 600లకు పైగా అస్థి పంజరాలు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఇవన్నీ చిన్నారుల అస్థి పంజరాలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ దారుణం కెనడా దేశంలో చోటు చేసుకుంది. ఇటీవలే మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరాలు బయటపడిన సంగతి తెలిసిందే.

Canada : పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు

215 Kids Bodies Unearthed In Canada

215 Kids Bodies : మూసి ఉన్న పాఠశాల ప్రాంతంలో 600లకు పైగా అస్థి పంజరాలు బయటపడడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఇవన్నీ చిన్నారుల అస్థి పంజరాలు కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ దారుణం కెనడా దేశంలో చోటు చేసుకుంది. ఇటీవలే మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరాలు బయటపడిన సంగతి తెలిసిందే. కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి.

ఇందులో మూడేళ్ల చిన్నారులు కూడా ఉండడం అందర్నీ కలచివేసింది. రాడార్ ద్వార లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇతర మూసిఉన్న రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో..కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో రాడార్ ద్వారా సెర్చ్ నిర్వహించారు. వందల కొద్ది గుర్తు తెలియని సమాధాలు ఉండడం నివ్వెరపరిచింది. ఇందులో దాదాపు 600 మందికిపైగానే చిన్నారులను సమాధి చేసినట్లు గుర్తించారు. వెంటనే తవ్వకాలు చేపట్టారు. చిన్నారుల అవశేషాలను బయటకు తీస్తున్నారు. 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో ఈ పాఠశాల కొనసాగింది.

ఈ ఘటనలపై కెనడా దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. మారివల్ రెసిడెన్షియల్ స్కూల్ లో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడిన వార్త విని తన గుండె బద్ధలైందని, తీవ్ర విచారకరమని వెల్లడించారు. ఈ దారుణాల వెనుక వాస్తవాలను వెలికి తీస్తామని తెలిపారు.

19వ శతాబ్దం నుంచి 1970 వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికిపైగా చిన్నారులను క్రిస్టియన్ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు, ఇక్కడి పాఠశాలల్లో మతమార్పిడిలు జరిగేవని తెలుస్తోంది. మాట వినని వారిని తీవ్రంగా కొట్టేవారనీ, చిన్నారులప శారీరక, లైంగిక వేధింపులు జరిగేవని ఇటీవలే కెనడా ప్రభుత్వం అంగీకరించింది. మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని, ఇళాంటి చర్యల వల్ల కనీసం 6 వేల మంది చిన్నారులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే..విద్యా సంస్థల్లో దారుణాలు జరిగాయంటూ..ఐదేళ్ల క్రితం నిజ నిర్ధారణ కమిషన్ ఒకటి నివేదిక వెల్లడించింది. కామ్ లూప్స్ పాఠశాలలో 1915-1963 మంధ్య 51 మరణాలు చోటు చేసుకొని ఉండవచ్చునని, మొత్తంగా 3 వేల 200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని వెలువరించింది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం తవ్వకాలు జరిపితే..ఇంకెని అస్థిపంజరాలు బయటపడుతాయనేది ఆందోళన వ్యక్తమౌతోంది.