US Winter Storm: మంచు గుప్పిట్లోనే అమెరికా.. 26 మంది మృతి.. రహదారులపై పేరుకుపోయిన మంచు.. ఫొటోలు

భారీస్థాయిలో మంచు తుపాను కారణంగా కార్లు, రహదారులు మంచుతో పూర్తిగా కప్పుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లోని రహదారులపై మోకాళ్ల లోతుమేర మంచు పేరుకుపోయింది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుపాను కారణంగా అమెరికాలో 26 మంది మరణించారు.

US Winter Storm: మంచు గుప్పిట్లోనే అమెరికా.. 26 మంది మృతి.. రహదారులపై పేరుకుపోయిన మంచు.. ఫొటోలు

Heavy snow sweeps in america

US Winter Storm: ఉత్తర అమెరికాను మంచు తుపాను వణికిస్తూనే ఉంది. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవు అవుతుండటంతో బయటకు వస్తే గడ్డకట్టే స్థాయిలో పరిస్థితి మారింది. దీంతో ప్రజలు తమ తమ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Heavy snow sweeps in america

Heavy snow sweeps in america

పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలతో హీటర్లుసైతం పనిచేయక పోవటంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాల్లో మంచు తుపాను కారణంగా 26 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Heavy snow sweeps in america

Heavy snow sweeps in america

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును ‘ బాంబ్ సైక్లోన్’ అని పిలుస్తారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో హరికేన్ స్థాయిలో చలిగాలులు వీస్తుండటంతో స్థానిక ప్రజలు గత నాలుగు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉంటున్నారు.

Heavy snow sweeps in america

Heavy snow sweeps in america

పలు ప్రాంతాల్లో వాహనాల్లో బయటకు వచ్చినా రోడ్లపై అవి జారిపోతుండటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ న్యూయార్క్ లోని లేక్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో రెండు నుంచి మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది.

Heavy snow sweeps in america

Heavy snow sweeps in america

భారీస్థాయిలో మంచు తుపాను కారణంగా కార్లు, రహదారులు మంచుతో పూర్తిగా కప్పుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతుమేర మంచు పేరుకుపోయింది. పలు ఇళ్లను మంచు పూర్తిస్థాయిలో కప్పేసింది. శని, ఆదివారాల్లో విమానాశ్రయాలను మూసివేశారు.

Heavy snow sweeps in america

Heavy snow sweeps in america

సోమవారం కూడా అదేపరిస్థితి ఉండటంతో విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, సోమవారం నాటికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.