Nobel Prize: ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్

ఫిజిక్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ సారి ముగ్గురికీ కలిపి నోబెల్ ప్రకటించింది. అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జెలింగర్ అనే ముగ్గురు సంయుక్తంగా నోబెల్ విజేతగా నిలిచారు.

Nobel Prize: ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్

Nobel Prize: భౌతిక శాస్త్రానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కమిటీ మంగళవారం ప్రకటించింది. 2022కుగాను ముగ్గురిని ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతికి ఎంపిక చేసింది. అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జెలింగర్ అనే ముగ్గురికీ కలిపి ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించింది.

Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

ఈ ముగ్గురు విజేతల్లో అలియన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త కాగా, జాన్ ఎఫ్.క్లాజర్ అమెరికా, ఆంటోన్ ఆస్ట్రియాకు చెందిన వారు. స్వీడన్‌కు చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డులను ప్రకటించింది. ఫోటాన్లపై ప్రయోగాలు, బెల్ సిద్ధాంతంలో చిక్కుముడులపై వివరణ, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి అంశాల్లో ఈ ముగ్గురు చేసిన ప్రయోగాలకుగాను వీరికి నోబెల్ బహుమతి లభించింది. సోమవారంతో ప్రారంభమైన నోబెల్ బహుమతుల ప్రకటన మరో ఐదు రోజులపాటు కొనసాగుతుంది. రోజుకు ఒక అంశంపై బహుమతిని ప్రకటిస్తారు.