53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్, 25 మంది మృతి 

  • Published By: sreehari ,Published On : April 17, 2020 / 10:30 AM IST
53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్, 25 మంది మృతి 

ప్రపంచ దేశాల్లోని మొత్తం భారతీయుల్లో 3,336 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో 25 మంది మృతిచెందినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు సహనం ఉండాలని, స్వదేశానికి తరలించడం అతిపెద్ద విధాన నిర్ణయంలో భాగమని, అందుకే ప్రభుత్వం ఎవరిని తరలించే పరిస్థితి లేదని తెలిపాయి.

‘విదేశాల్లో ఉన్న భారతీయులు ఉన్నచోటనే కాస్తా ఒపిగ్గా ఉండాల్సిన సమయం. చిక్కుకున్న భారతీయులకు సాయం చేసేందుకు సాధ్యమైనంతవరకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని, ఇప్పటికే ఆయా దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. కొన్ని వర్గాల ప్రకారం.. 48 దేశాలకు చెందిన 35వేల మంది విదేశీయులను తరలించాల్సి ఉందని, ఇప్పటివరకు భారత్ నుంచి మాత్రమే స్వదేశీయులను తరలించడాన్ని సులభతరం చేసినట్టు తెలిపింది. 

గల్ఫ్ ప్రాంతంలో నివసించే మెజార్టీ భారతీయుల్లో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్, అమెరికాలోని కొద్దిపరిమాణంలో నివసించే భారతీయులకు కూడా కరోనా వైరస్ సోకింది. గల్ఫ్ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులందరికి సాధ్యమైనంతవరకు సాయాన్ని మరికొన్నిరోజుల పాటు పొడిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

గల్ఫ్ దేశాల్లో దాదాపు 8 మిలియన్ల మంది భారతీయులు నివాసముంటున్నారు. దాంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది. చమురుపరంగా ఆర్థికంగా ఎదిగిన ప్రాంతమైన గల్ఫ్ దేశాల్లో మహమ్మారి విస్తరించడంతో అక్కడ చమురు కేంద్రాల్లో పనిచేసేవారి జీవనోపాధిపై ప్రభావం పడింది. ఇప్పటికే గల్ఫ్ దేశాలన్నీ కరోనా నియంత్రణకు కఠినమైన చర్యలతో మొత్తం లాక్ డౌన్ విధించాయి. 

ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కరోనాను వ్యాప్తి ప్రబలంకుండా ఉండేందుకు సరిహద్దులను కూడా మూసివేశాయి. ఇదివరకే యూనైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఇతర దేశాలను హెచ్చరించాయి. తమ దేశీయులను తిరిగి స్వదేశానికి అనుమతి నిరాకరణపై సాధ్యమైనంత తొందర చర్యలు చేపట్టాలని సూచించింది. యూఏఈలో దాదాపు 3.3 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. గల్ఫ్ దేశీయ జనాభాలో 30 శాతం మంది భారతీయులే ఉన్నారు. 

భారతదేశపు రాష్ట్రాల్లో కేరళ నుంచి ఎక్కుమంది ఉండగా, ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఉన్నారు. ఖతర్ లోని నిర్మాణ రంగంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. 2022లో FIFA వరల్డ్ కప్ ఇక్కడే అతిథ్యమివ్వనుంది. పాలసీ విధానంలో భాగంగా భారతదేశం.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసేంతవరకు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తరలించడంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.