Chinese In Pak : మినీ చైనాగా మారిపోతున్న పాకిస్తాన్!

పాకిస్తాన్ లో చైనీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ లో పనిచేసే చైనీయుల సంఖ్య 50లక్షల వరకు ఉండే అవకాశముందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.

Chinese In Pak : మినీ చైనాగా మారిపోతున్న పాకిస్తాన్!

China Pak

Chinese In Pak పాకిస్తాన్ లో చైనీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ లో పనిచేసే చైనీయుల సంఖ్య 50లక్షల వరకు ఉండే అవకాశముందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణులు తెలిపారు. పాకిస్తాన్ లో మౌలిక సదుపాయల కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) లేదా సీపెక్.. కింద భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది డ్రాగన్ దేశం.

మరోవైపు పాకిస్తాన్ ఆరోగ్య రంగంలోనూ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు చైనా సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. పాకిస్తాన్ మరియు చైనీస్ మెడికల్ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు మరియు బయోటెక్నాలజీ సంస్థల మధ్య సఖ్యత.. చైనా పాకిస్తాన్ హెల్త్ కారిడార్ (CPHC) కింద మరింత విస్తరించబడుతోందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణుడు ఒకరు తెలిపారు. హెల్త్ కారిడార్ కి సంబంధించి చైనా సంస్థలతో సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ లో మరింత పాతుకుపోయేందుకే హెల్త్ కారిడార్ పెరుతో చైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తారు.

ఈ నెల 23,24 తేదీల్లో ఇస్లామాబాద్ లో జరగబోయే 11వ వార్షిక ప్రజారోగ్య సమావేశాల్లో చైనా-పాక్ సంస్థల మధ్య చాలా ఒప్పందాలు జరిగే అవకాశమున్నట్లు తెలిపారు. మొదటగా వూహాన్ యూనివర్శిటీలోని ప్రాజారోగ్య విభాగంతో చైనా-పాకిస్తాన్ మధ్య పలు ఒప్పందాలు జరుగుతాయని చైనా-పాక్ హైల్త్ కారిడార్ చైర్మన్ డాక్టర్ లీ తెలిపారు.

మరోవైపు,పాకిస్తాన్ హైల్త్ సర్వీసెస్ అకాడమీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ షహజాద్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ..పాక్ తో పాటు అప్ఘానిస్తాన్ సహా సెంట్రల్ ఏసియా దేశాల్లో లక్షల మంది చైనీయులు పనిచేస్తున్నారు. వారి ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక వైద్య సుదుపాయాలు కావాలి. దీనికోసం నూతన వైద్య సాంకేతికతతోపాటు సంప్రదాయ చైనా మందులపై పాకిస్తాన్ నిపుణులకు శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అయితే కేవలం చైనా నుంచి వచ్చే వాళ్ల ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ కోసం చూస్తున్న పాక్ ప్రజలకు ఈ నిపుణులు చాలా రకాలుగా దోహదపడతారని అన్నారు.