15 మందికి కరోనా అంటించిన బర్త్ డే పార్టీ.. ‘నా కుటుంబంలా మీరు చేయకండి’

15 మందికి కరోనా అంటించిన బర్త్ డే పార్టీ.. ‘నా కుటుంబంలా మీరు చేయకండి’

Covid: బర్త్ డే పార్టీ అంటూ అంతా కలిశారు. అంతా కోలాహలంగా జరుపుకున్న దాదాపు 15మందికి కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. గతవారం ఆర్లింగ్‌టన్ సిటీ ఓ వీడియో రిలీజ్ చేసింది. కరోనావైరస్‌ ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తూ ఈ పోస్టు చేశారు.

‘నేను మా మేనల్లుడి ఇంటికి వెళ్లి నా కుటుంబాన్ని కలిశాను. కానీ, ఇప్పుడు హాస్పిటల్ లో కరోనాతో పోరాడుతున్నాను’ అంటూ 57సంవత్సరాల ఎన్‌రిక్వెటా ఆరాగోనెజ్ వీడియో మెసేజ్ చెప్పింది. ముక్కుకు ప్లాస్టిక్ ట్యూబ్స్‌తో హాస్పిటల్ బెడ్‌పై ఉంది. మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ నవంబర్ 12నుంచి న్యూమోనియోతో బాధపడుతున్న ఆమె చెప్పింది.




https://10tv.in/tata-motors-takes-another-dig-at-maruti-suzuki-mocks-wagonrs-global-ncap-rating/
ఆమె కూతురు కూడా ఆ వీడియోలో కనిపిస్తూ.. ‘మా కుటుంబం ఎదుర్కొంటున్న ఈ బాధ, ఒంటరితనం, జబ్బు అంతా జాగ్రత్తలు తీసుకుని ఉంటే జరిగేది కాదు. నా కుటుంబంలా కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఉండకండి. దూరంగా ఉంటూనే మనమంతా కలిసి ఈ వైరస్ తో పోరాడదాం. మీ నుంచి మొదలైన ప్రయత్నమే కరోనాకు అంతం కావాలి’ అని ఆమె చెప్పింది.

ఇది మా కుటుంబానికి గుణపాఠం అనుకుంటాం. ఒక్క క్షణం అజాగ్రత్త నెలరోజుల శాంతిని హరించింది. నిద్రను దూరం చేసి భారీ మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టేలా చేసిందని ఆమె వాపోయింది.

పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్ లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్ లైన్స్ ప్రకారం.. మీకు ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంట్లోనే ఉండండి. చేతులు తరచూ కడుక్కుంటూ ఉండండి. ఫేస్ మాస్క్ ధరించి కనీసం 6అడుగుల దూరం పాటించండి. గత వారానికి దేశంలో 12మిలియన్ కేసులు దాటేశాయి. మార్చి తర్వాత దీనిని మూడో వేవ్ కింద పరిగణిస్తున్నారు.

ఒక్క టెక్సాస్ లోనే 11లక్షల 72వేల 664కేసులు నమోదుకాగా, 21వేల 83మృతులు సంభవించాయని న్యూయార్క్ టైమ్స్ డేటాబేస్ చెప్తుంది. ఆదివారం రాష్ట్రంలో 79కొత్త కరోనా మృతులు నమోదు కాగా 8వేల 534కొత్త కేసులు నమోదయ్యాయి.