Afghan Kidnappers: తాలిబన్ల కిరాతకం.. చంపేసి క్రేన్‌కు వేలాడదీశారు!

తాలిబన్లు కిరాతకాన్ని మళ్లీ బయటపెట్టారు. అప్ఘాన్ ఆక్రమించుకున్న కొన్ని నెలల్లోనే తాలిబన్లు మునుపటిలా తమ రాక్షస పాలనను కొనసాగిస్తున్నారు.

Afghan Kidnappers: తాలిబన్ల కిరాతకం.. చంపేసి క్రేన్‌కు వేలాడదీశారు!

A Lesson For Kidnappers Taliban Hang 4 Bodies From Cranes In Afghan City's Main Square

Updated On : September 27, 2021 / 9:26 AM IST

A lesson for kidnappers: తాలిబన్లు కిరాతకాన్ని మళ్లీ బయటపెట్టారు. అప్ఘాన్ ఆక్రమించుకున్న కొన్ని నెలల్లోనే తాలిబన్లు మునుపటిలా తమ రాక్షస పాలనను కొనసాగిస్తున్నారు. అప్ఘాన్ లోని హెరాత్ ప్రావిన్స్ లోని ప్రధాన కూడలిలో పైశాచికంగా ప్రవర్తించారు తాలిబన్లు.. కిడ్నాపర్లను హతమార్చామంటూ నలుగురి మృతదేహాలను బహిరంగంగా క్రేన్‌కు వేలాడిదీశారు. కిడ్నాపర్లకు ఇదో గుణపాఠం మంటూ తాలిబన్లు సమర్థించుకుంటున్నారు.
Reserve Bank : ఏటీఎం వద్ద ఓ మనిషి ఎంతసేపు ఓపికగా ఉండగలడు ?..సంచలన విషయాలు

గతంలో మాదిరిగానే తమ పాలన ఉండబోతుందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. షరియా చట్టం ప్రకారమే కఠిన శిక్షలను అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించుకున్నారు. చేతులు నరికేస్తామని, బహిరంగంగా ఉరితీస్తామంటూ తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి పేర్కొన్నారు. హెరాత్ ప్రాంతంలో ఫార్మసీకి చెందిన వ్యక్తి చెప్పిన ప్రకారం.. తాలిబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలిలో క్రేన్ కు వేలాడదీశారు.

మిగతా మృతదేహాలను మరో కూడళ్లలో వేలాడ దీసేందుకు వెళ్లారంటూ తెలిపాడు. హతమైన నలుగురు వ్యక్తులు కిడ్నాపర్లుగా తాలిబన్లు చెబుతున్నారు. పోలీసుల చేతిలో కిడ్పాపర్లు హతమయ్యారని తాలిబన్లు ప్రకటించారు. ఆగస్టు 15న తాలిబన్ అప్ఘాన్ ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి తాలిబన్లు చీకటి పాలనలో అప్ఘాన్ ప్రజలు మగ్గిపోతున్నారు.
LIC ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం అప్లయ్ చేసుకోండిలా!