Russia : షాకింగ్ వీడియో, వంతెనపై ప్రయాణిస్తున్న ట్రక్…తర్వాత

ఓ ట్రక్కు వంతెన మీదుగా ప్రయాణిస్తూ...ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవడంతో ట్రక్కు కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Russia : షాకింగ్ వీడియో, వంతెనపై ప్రయాణిస్తున్న ట్రక్…తర్వాత

Bridge

Bridge Collapsed : వర్షకాలంలో నదులు ఉప్పొంగుతుంటాయి. ప్రమాదకరస్థితిలో పరవళ్లు తొక్కుతుంటాయి. నదులపై ఉన్న వంతెనల మీదుగా నీళ్లు వెళుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే..కొంతమంది వీటి మీదుగా ప్రయాణిస్తూ..ప్రమాదాల బారిన పడుతుంటారు. నది ఉధృతి ధాటికి కొట్టుకపోతుంటారు. వంతెనలపై లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు తీసుకెళుతూ…చిక్కుల్లో పడుతుంటారు కొందరు.

Read More : Covid Vaccine Booster : కొవిడ్ టీకా బూస్టర్ డోసులు అవసరమా? ఎప్పుడు వస్తాయంటే?

తాజాగా..ఓ ట్రక్కు వంతెన మీదుగా ప్రయాణిస్తూ…ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవడంతో ట్రక్కు కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు రష్యాలోని ఓ నదికి వరద పోటెత్తింది. east of Chita ప్రాంతంలోని Uryum గ్రామం గుండా ఈ నది ప్రవహిస్తోంది. ఈ నదిపై ఉన్న వంతెన తాకుతూ…వరద ప్రవహిస్తోంది.

Read More : Viral Video: రోడ్డు దాటుతున్న చేపలు.. మన తెలంగాణలోనే అంటూ వైరల్!

ఈ వంతనను పైనుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓ వ్యక్తి వంతెన పై నుంచి సురక్షితంగా వెళ్లగా..దీనిపై ప్రయాణించడానికి ఓ ట్రక్కు వచ్చింది. ప్రమాదకరమని తెలిసినా..ట్రక్కు డ్రైవర్ వంతెనపై నుంచి పోనిచ్చాడు. వంతెన మధ్యలోకి రాగానే..ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో డ్రైవర్ తో పాటు వాహనం కూడా నదిలో పడిపోయింది. నీటి ఉధృతికి వాహనం కొట్టుకపోయింది. వాహనంలో ఉన్న వారు క్షేమంగా బయటకు వచ్చారా ? రాలేదా ? అనేది తెలియరాలేదు. haudhary Parvez ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వంతెన చెక్కతో తయారు చేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.