5నిమిషాల్లోనే కరోనా పాజిటివ్ అయితే చెప్పేస్తుంది

  • Published By: vamsi ,Published On : March 28, 2020 / 07:08 AM IST
5నిమిషాల్లోనే కరోనా పాజిటివ్ అయితే చెప్పేస్తుంది

కరోనా భయానికి సగం కారణం.. వ్యాధిని కనిపెట్టడం ఆలస్యం కావడమే.. కరోనా సోకిందని తెలియడానికి టెస్ట్‌లు అయిపోయి రావడానికి చాలా సమయమే పడుతుంది. ఇది అసలు సమస్యగా మారిపోయింది ప్రపంచం అంతా. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా అమెరికా వేసిన అడుగులు సఫలం అయ్యాయట.

కేవలం ఐదు నిమిషాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసే పరికరాన్ని అభివృద్ధిచేసినట్టు అమెరికాకు చెందిన అబాట్ అనే సంస్థ అప్రకటించింది. అబాట్ ల్యాబొరేటరీస్ రూపొందించిన ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 

వచ్చేవారమే ఈ కిట్ వైద్య సిబ్బందికి అందుబాటులోకి రానుందని అబాట్ వెల్లడించింది. చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే మాలిక్యులర్ టెక్నాలజీ పరికరం.. వ్యక్తి నమూనాలను పరీక్షించి.. కరోనా వైరస్ ఉందా? పాజిటివ్.. అనే విషయాన్ని ఐదు నిమిషాల్లో చెప్పేస్తుంది. అంతేకాదు, నెగెటివ్ ఉంటే 13 నిమిషాల్లో  రిజల్ట్ వచ్చేస్తుందని అబాట్ ల్యాబొరేటరీస్ చెప్పింది.

ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇల్లినాయిస్ ఆధారిత అబాట్స్ ఐడి నౌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ప్రస్తుతం యుఎస్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సాధారణ పాయింట్-ఆఫ్-కేర్ పరీక్ష, దేశవ్యాప్తంగా 18,000 యూనిట్లకు పైగా విస్తరించి ఉంది. స్ట్రెప్ గొంతు మరియు శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ గుర్తించడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ పరికరం చిన్న పరిమాణంలో ఉండటం వల్ల హాస్పిటల్ బయటే దీని సాయంతో పరీక్షలు నిర్వహించవచ్చు అని సదరు కంపెనీ చెబుతుంది.