Covid-19: కరోనా తగ్గిన చిన్నారుల్లో కాలేయ వ్యాధి ముప్పు

క‌రోనా వ్యాధి నుంచి బయటపడ్డ చిన్నారుల్లో పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాలు సతమతపెడుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్ల‌లు అక్యూట్ హెప‌టైటిస్‌ అనే వింత సమస్యతో బాధపడుతున్నారని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది.

Covid-19: కరోనా తగ్గిన చిన్నారుల్లో కాలేయ వ్యాధి ముప్పు

Covid 19 India India Reports 2,827 New Covid 19 Cases, 24 Deaths In Last 24 Hours

Covid-19: క‌రోనా వ్యాధి నుంచి బయటపడ్డ చిన్నారుల్లో పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాలు సతమతపెడుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్ల‌లు అక్యూట్ హెప‌టైటిస్‌ అనే వింత సమస్యతో బాధపడుతున్నారని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. ఇప్పటికే ప‌దిమంది పిల్ల‌లు ఈ వ్యాధితో ప్రాణాలుకూడా కోల్పోయారు.

ఈ అక్యూట్ హెప‌టైటిస్‌ మొద‌టికేసు తొలిసారి యూకేలో బ‌య‌ట‌ప‌డింది. ఈ కాలేయ సంబంధిత వ్యాధిపై స్పష్టత రావడం లేదు. హెప‌టైటిస్- ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు వైర‌స్‌లు సాధార‌ణంగా హెప‌టైటిస్‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. అక్యూట్ హెప‌టైటిస్‌పై జరిపిన పరీక్షల్లో కాకపోతే జరిపిన పరీక్షల్లో ఈ వైర‌స్‌లు క‌నిపించ‌లేదు.

దీంతో ఈ వ్యాధిని పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణ‌ంగా పేర్కొన్నారు పరిశోధకులు. ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తేలిక‌పాటి కొవిడ్ -19నుంచి కోలుకున్న ఐదుగురు చిన్నారుల‌పై అధ్య‌య‌నం నిర్వ‌హించారు. వారిపై రెండు ర‌కాల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేశారు.

Read Also: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్..ఇండియాలో తొలిసారి

అందులో 3,5 నెల‌ల వ‌య‌స్సుగ‌ల ఇద్ద‌రు చిన్నారులు తీవ్ర‌మైన కాలేయ సంబంధ వ్యాధి (అక్యూట్ హెప‌టైటిస్‌)తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. కొవిడ్ కంటే ముందు ఆరోగ్యంగా ఉండగా కొవిడ్ తర్వాత సమస్యకు గురైనట్లు వెల్లడైంది. మిగిలిన ముగ్గురిలో 8, 13 ఏళ్ల వ‌య‌స్సుగ‌ల ఇద్ద‌రు కొలెస్టాసిస్ హెప‌టైటిస్ అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌నుగొన్నారు.