స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించిన అఫ్ఘనిస్తాన్

అఫ్ఘనిస్తాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించింది. పబ్లిక్ ఈవెంట్లో పాడకూడదని ఆంక్షలు విధించింది. అధికారం తిరిగి చేజిక్కించుకోవడానికి తాలిబాన్లు చేస్తున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ స్టేట్స్ తో ఇలా ఒప్పందం కుదుర్చుకుంది.

స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించిన అఫ్ఘనిస్తాన్

singing girls

Afghanistan Schoolgirls: అఫ్ఘనిస్తాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించింది. పబ్లిక్ ఈవెంట్లో పాడకూడదని ఆంక్షలు విధించింది. అధికారం తిరిగి చేజిక్కించుకోవడానికి తాలిబాన్లు చేస్తున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ స్టేట్స్ తో ఇలా ఒప్పందం కుదుర్చుకుంది.

ఒకవేళ 12ఏళ్ల వయస్సులోపు ఉన్న బాలికలు పాడాలని అనుకుంటే.. పూర్తిగా 100శాతం మహిళలు మాత్రమే ఉన్న ఈవెంట్ లో పాడుకోవచ్చు. అని ఓ ప్రముఖ మీడియా సంస్థకు తన నిర్ణయాన్ని లెటర్ ద్వారా పంపినట్లు ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది.

ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ మినిష్ట్రీ ఈ లెటర్ ను కన్ఫామ్ చేసినట్లు చెప్పారు. పైగా స్టూడెంట్లు, పేరెంట్స్ తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా స్కూల్ గర్ల్స్ కు సింగింగ్ క్లాస్ చెప్పేందుకు మగ టీచర్లను కూడా నిషేదించారు. అలా జరిగితే స్కూల్ ప్రిన్సిపాల్స్ దే బాధ్యత అని రిపోర్టు చెప్పింది.

తాలిబాన్‌తో పాటు సమానంగా తీసుకున్న ఈ నిర్ణయం సబబు కాదని జర్నలిస్ట్ రుచి కుమార్ ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. మరికొంత మంది సామాజిక కార్యకర్తలు అఫ్ఘన్ బాలికలపై జరుగుతున్న దాడులపై గొంతెత్తకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇలా చేస్తే దాని లక్ష్యం ఏంటని అడుగుతున్నారు.