Ysrcp: ఓవైపు నిరాశ.. ఇంకోవైపు వర్గపోరు.. వైసీపీలో డిఫరెంట్ సీన్
ఇలా రెండు వర్గాలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగుతుండటంతో క్యాడర్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయట. వర్గపోరుకు వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
Ysrcp: నిరాశలో క్యాడర్. నియోజకవర్గాలను వదిలేసిన లీడర్లు. ఓటమి తర్వాత వైసీపీలో ఒక్కసారిగా జోష్ తగ్గింది. లీడర్లు యాక్టీవ్‌గా లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డ పరిస్థితి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీన్ మారోలా ఉంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఫ్యాన్ పార్టీ లీడర్లు ఇప్పటి నుంచే రచ్చకెక్కుతున్నారు. దీంతో వైసీపీలో పరిస్థితులు గమ్మత్తుగా ఉన్నాయట. 2029 ఎన్నికల కోసం జగన్ వ్యూహమేంటి? పార్టీ గాడిలో పెట్టేదెలా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైసీపీ డిఫరెంట్ సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో అంతా తామేనని.. ముందుండి నడిచిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. మాజీ మంత్రులు, కీలక పదవులు చేపట్టిన నేతలు..ఓడిపోగానే సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. చాలా నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించడం..ఇంచార్జ్‌లు యాక్టీవ్‌గా లేని నియోజకవర్గాల్లో మరొకరికి బాధ్యతలు అప్పగించడం వంటి డెసిషన్ తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్.
ఈ క్రమంలో పార్టీ యాక్టివిటీ..ముందుండి నడిపించే నాయకులు లేక జిల్లాల్లో క్యాడర్ నిరాశలో ఉందన్నది వైసీపీ వర్గాల టాక్. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్, లీడర్లు సైలెంట్ మోడ్‌లోనే ఉన్న పరిస్థితి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటినుంచే టికెట్ ఫైట్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నేతలు. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల కోసం ఓవైపు..ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినా అదే నియోజకవర్గంలో కంటిన్యూ అయ్యేందుకు మరికొందరు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పీక్‌కు వర్గ విభేదాలు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు పీక్‌కు చేరాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక మరోవైపు యువ నాయకుడు రాజీవ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కుతుంది. ఎవరికి వారు బల ప్రదర్శనలు చేయడం, పార్టీ లైనుకు భిన్నంగా పోటాపోటీగా కార్యక్రమాలు చేయడం చర్చకు దారితీస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలు హీటెక్కాయి. బుట్టా రేణుక వర్గం ఒక కార్యక్రమం చేపట్టగా, రాజీవ్ రెడ్డి వర్గం మరోలా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నాయి. పార్టీ నేతలంతా కలిసి కోటి సంతకాలు సేకరణ పూర్తి చేయాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అదే విధంగా క్షేత్రస్థాయిలోనూ చెప్పుకొచ్చారు. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. ఇతర చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. ఎమ్మిగనూరులో మాత్రం బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డి వర్గపోరు మరోసారి హాట్ టాపిక్ అయింది.
ఎవరినీ కాదనలేని పరిస్థితిలో పార్టీ అధిష్టానం..
బలమైన రెడ్డి సామాజిక వర్గం అంతా తనవైపే ఉందని రాజీవ్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా జగన్ చెప్పిందే తాను చేస్తున్నానని బుట్టా రేణుక వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ విభేదాలు పెట్టుకొని పార్టీలో చీలికలు తెస్తున్నారని క్యాడర్ రగిలిపోతోందట. ఎవరి తరఫున మాట్లాడితే ఎవరికీ కోపం వస్తుందో..ఏ నేతకు మద్దతు తెలిపితే ఎవరికి కోసం వస్తుందోనన్న డైలమా కార్యకర్తల్లో నెలకొందట. ఇటు బుట్టా, అటు రాజీవ్‌రెడ్డి వర్గాలు ఆర్థికంగా బలంగా ఉండడం, రెండు వర్గాలకు అంతో ఇంతో ప్రజాబలం ఉండటంతో ఎవరినీ కాదనలేని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉందట. ఎమ్మిగనూరులో పరిణామాలను పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకోకపోవడానికి ఇదే కారణమంటున్నారు. టికెట్ ఫైటే కాదు..ప్రజల్లోకి వెళ్లేప్పుడు కూడా ఎవరికి వారుగా వెళ్లడం ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టడం వంటివి క్యాడర్‌లో ఆందోళనకు దారితీస్తున్నాయట.
క్యాడర్‌లో గందరగోళ పరిస్థితులు..
2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతూ వచ్చారు. అయితే బుట్టా రేణుక రాజకీయ ఎదుగుదల..మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, ఆయన వర్గీయులకు మింగుడు పడటం లేదట. ఎలాగైనా ఆమెను ఎమ్మిగనూరు నుంచి పంపించాలని పట్టుబట్టి..ఇప్పటికే బుట్టా రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనుమడు రాజీవ్‌రెడ్డిని వైసీపీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినా..పార్లమెంటు సమన్వయ కర్తగా బుట్టా రేణుక ఎమ్మిగనూరులో తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారట. ఇలా రెండు వర్గాలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగుతుండటంతో క్యాడర్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయట. వర్గపోరుకు వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
Also Read: ఒకే ఒక్క స్టేట్‌మెంట్.. వైసీపీకి అంతా రివర్స్..! జగన్ చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకింత రచ్చ?
