Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది.

Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

Afghan Airspace Closed

afghan airspace closed : కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలు..అని అనుకుంటున్న జనాలు ఏ దేశమైనా వెళ్లిపోయి బతుకుదామని కుటుంసభ్యులతో ఎయిర్ పోర్టుకు పరుగులు తీస్తున్నారు. కట్టుబట్టలతో విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేస్తున్నట్లు ప్రకటన రావటంతో పౌరవిమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎయిర్ స్పేస్ మూసివేయటంతో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అమెరికా నుంచి భారత్ వచ్చే విమానాల దారిమళ్లాయి. చికాగో-న్యూఢిల్లీ (AI-126), శాన్‌ఫ్రాన్సిస్కో-న్యూఢిల్లీ (AI-174) విమానాలను గల్ఫ్ దేశాల మీదుగా రీ-ఫ్యూయలింగ్ చేసి భారత్‌కు తరలిస్తున్నాయి. దీంతో అఫ్ఘానిస్తాన్ విడిచి వెళ్లాలనుకున్నవారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం తాలిబన్ల వశం కావడంతో దేశం విడిచిపోతున్న క్రమంలో అఫ్ఘాన్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన రావటంతో ఆ దేశంలో ఉన్న భారతీయులు సహా అనేక దేశాలకు చెందిన ప్రజలు అక్కడేచిక్కుకుపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లోని భారత పౌరులని రప్పించేందుకు భారత ప్రభుత్వం రెండు ఎయిర్ ఇండియా విమానాలను సిద్ధం చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది. ఆఫ్గాన్ లో ఉన్న తమ పౌరులనుతమ దేశాలకు రప్పించేందుకు భారత్ తో సహా పలు దేశాలు విమానాలను ఏర్పాటు చేశాయి. దీంతో ఆఫ్గాన్ ఎయిర్ పోర్టు జనాలతో కిక్కిరిపోయింది. ఈక్రమంలో ప్రస్తుతం ఆ దేశ పరిస్థితుల రీత్యా ఆఫ్గానిస్థాన్ గగనతలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటన రావటంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో భారత్ తో సహా పలుదేశాలకు చెందిన ప్రజలు అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది.

కాగా..అఫ్గానిస్థాన్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్న వారిని సరిహద్దులను దాటడానికి అనుమతించాలని తాలిబన్లను అమెరికా సహా ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి. రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో వేలాది మంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చారు. రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు విమానాలు నిలిపివేశారు. గగనతలాన్ని మూసివేయడంతో.. విమానాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరుకునే విదేశీయులు సహ అఫ్గాన్ పౌరులను కూడా తాలిబన్లు అడ్డుకోరాదని యూఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు 65 మిత్రదేశాలు సంతకాలు చేసిన ఓ ప్రకటను అమెరికా విడుదల చేసింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.

‘దేశవ్యాప్తంగా అధికారం హస్తగతం చేసుకున్నవారు.. మానవ జీవితం.. ఆస్తుల రక్షణ.. భద్రత.. పౌరుల సాధారణ జీవణం తక్షణ పునరుద్ధరణ విషయంలో బాధ్యత, జవాబుదారీతనం కలిగి ఉండాలి’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాశ్రయాలు, రహదారులు, సరిహద్దులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి అని అన్నాయి. మరోవైపు, కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ప్రకటించింది.

అమెరికా బలగాలు అఫ్గన్ నుంచి వెనక్కు వెళ్లిపోయిన వారానికే దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అఫ్గన్‌లో మారణహోమానికి, తాలిబన్లు ఆ దేశంలో రాజ్యాధికారం పొందడానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణమంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అఫ్గనిస్తాన్‌ అంతర్గత వ్యవహారంలో జోక్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో బలగాలను బైడెన్ వెనక్కు రప్పించిన విషయం తెలిసిందే.